తెలంగాణ

telangana

ETV Bharat / sports

Omicron Effect: దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ వన్డే సిరీస్ వాయిదా - దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ వన్డే సిరీస్ వాయిదా

SA vs NED ODI Series Postponed: దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్​ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది క్రికెట్ సౌతాఫ్రికా. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

SA vs NED
SA vs NED

By

Published : Nov 27, 2021, 6:52 PM IST

ఆఫ్రికా దేశాల్లో కరోనా కొత్త వేరియంట్(Corona New Variant Omicron) కలకలం సృష్టిస్తోంది. దీంతో అక్కడి ప్రజల రాకపోకలపై పలు దేశాలు ఇప్పటికే ఆంక్షల్ని విధించాయి. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న, జరగబోయే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడుతున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్​ను కూడా వాయిదా వేసింది క్రికెట్ సౌతాఫ్రికా.

ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయింది. ఇక మిగిలిన రెండు వన్డేలను వాయిదా వేశారు. ఈ మ్యాచ్​ల రీషెడ్యూల్​ వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

2023 World Cup Qualifiers: 2023 ప్రపంచకప్​ క్వాలిఫికేషన్​లో భాగంగా ప్రస్తుతం వన్డే సూపర్ లీగ్ జరుగుతోంది. ఇందులో భాగంగానే దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మధ్య వన్డే సిరీస్​ను నిర్వహించాలని ఇరుబోర్డులు అంగీకారం కుదుర్చుకున్నాయి. ఈ సిరీస్​లో గెలిచి వన్డే ప్రపంచకప్ క్వాలిఫికేషన్​లో ముందడుగు వేయాలని ఇరుజట్లు భావించాయి. కానీ కరోనా కొత్త వేరియంట్ వీరి ఆశలపై నీళ్లు జల్లింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో దక్షిణాఫ్రికా, 12లో నెదర్లాండ్స్ ఉన్నాయి.

ఇవీ చూడండి: కరోనా సెగ.. ఉమెన్స్ వరల్డ్​కప్ క్వాలిఫయర్ టోర్నీ రద్దు

ABOUT THE AUTHOR

...view details