తెలంగాణ

telangana

ETV Bharat / sports

Rohit Sharma World Cup : ప్రపంచ రికార్డుకు అతి దగ్గరలో 'హిట్​మ్యాన్'.. రోహిత్ దరిదాపుల్లో కూడా ఎవరు లేరుగా! - టాప్ 5 అంతర్జాతీయ సిక్సర్లు

Rohit Sharma World Cup : భారత్-అఫ్గానిస్థాన్​ మ్యాచ్​లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. పలు మైలురాళ్లను అందుకునే ఛాన్స్​ ఉంది. ఈ నేపథ్యంలో ఏకంగా ప్రపంచలోనే టాప్ బ్యాటర్​గా నిలిచే అవకాశం ఉంది. మరి అదేంటంటే

Rohit Sharma World Cup
Rohit Sharma World Cup

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 12:02 PM IST

Updated : Oct 11, 2023, 1:17 PM IST

Rohit Sharma World Cup :2023 ప్రపంచకప్​లో భారత్ రెండో మ్యాచ్​ ఆడేందుకు సిద్ధమైంది. దిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా​ భారత్​, అఫ్గానిస్థాన్​తో తలపడనుంది. అయితే తొలి మ్యాచ్​లో తీవ్రంగా నిరాశపర్చిన కెప్టెన్ రోహిత్ శర్మను పలు అరుదైన ఘనతలు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్​లోనైనా రోహిత్ ఈ రికార్డులు అధిగమించాలని అతడి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఆ రికార్డులేంటంటే

రోహిత్ సిక్సర్ల ఘనత..
Rohit Sharma International Sixes: హిట్​మ్యాన్ రోహిత్​.. ఇప్పటివరకూ 452 అంతర్జాతీయ మ్యాచ్​ల్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 551 సిక్సర్లు సంధించాడు. మరో మూడు సిక్స్​లు బాదితే.. అత్యధిక సిక్సర్ల జాబితాలో 554తో టాప్​లోకి దూసుకెళ్తాడు. ఈ లిస్ట్​లో ప్రస్తుతం వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 553 సిక్స్​లతో ఫస్ట్​ ప్లేస్​లో కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో (రిటైర్ కానివారు) ఇంగ్లాండ్ బ్యాట్లర్ (315 సిక్స్​లు).. టాప్​ 10లో చివరి ప్లేస్​లో ఉన్నాడు. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(283) 11 వ స్థానంలో కొనసాగుతున్నాడు.

అంతర్జాతీయంగా అత్యధిత సిక్స్​లు బాదిన టాప్ 5 బ్యాటర్లు..

  • క్రిస్ గేల్ - వెస్టిండీస్ 553 సిక్సర్లు
  • రోహిత్ శర్మ - భారత్ 551 సిక్సర్లు
  • షాహిద్ అఫ్రిదీ - పాకిస్థాన్ 476 సిక్సర్లు
  • బ్రెండన్ మెకల్లమ్ - న్యూజిలాండ్ 389 సిక్సర్లు
  • మార్టిన్ గప్టిల్ - న్యూజిలాండ్ 383 సిక్సర్లు

రోహిత్ @1000..
రోహిత్ తన కెరీర్​లో ప్రస్తుతం మూడో వన్డే ప్రపంచకప్​ ఆడుతున్నాడు. ఈ మూడు ఎడిషన్​లలో రోహిత్ 18 మ్యాచ్​ల్లో కలిపి 978 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. 2015లో ఒక సెంచరీ బాదగా.. 2019లో ఏకంగా 5 శతకాలు నమోదు చేశాడు. ఇక ప్రపంచకప్​లో వెయ్యి పరుగులు మైలురాయి అందుకోవాలంటే ప్రస్తుతం రోహిత్​కు 22 పరుగులు కావాలి. ఈ క్రమంలో మెగాటోర్నీలో 1000 పరుగులు దాటిన నాలుగో భారత బ్యాటర్​గా రోహిత్ నిలుస్తాడు.

టాప్ 5 భారత బ్యాటర్లు

  • సచిన్ తెందూల్కర్ 2278 పరుగులు 45 మ్యాచ్​లు
  • విరాట్ కోహ్లీ 1115 పరుగులు 27 మ్యాచ్​లు
  • సౌరభ్ గంగూలీ 1006 పరుగులు 21 మ్యాచ్​లు
  • రోహిత్ శర్మ 978 పరుగులు 18 మ్యాచ్​లు
  • రాహుల్ ద్రవిడ్ 860 పరుగులు 22 మ్యాచ్​లు

Hardik Pandya Birthday : ​పాండ్య దిగితే పూనకాలే.. పాక్​పై ఆ ఇన్నింగ్స్​ ఎప్పటికీ స్పెషల్!

Ind vs Afg World Cup 2023 : పాక్​ కంటే ముందు అఫ్గాన్​​తో పోరు.. వారిపైనే ఫోకస్!

Last Updated : Oct 11, 2023, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details