తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అదంతా రబ్బిష్'​.. 'ఓవర్ కాన్ఫిడెన్స్​' విమర్శలపై రోహిత్​ శర్మ ఫైర్

మూడో టెస్టు ఓడిపోవడం వల్ల వచ్చిన విమర్శలపై టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. మొదటి రెండు టెస్టులు గెలిచిన తర్వాత కూడా ఇలా విమర్శించడం సరికాదని విమర్శలు చేసిన మాజీలకు హితవు పలికాడు. ఇంకా ఏమన్నాడంటే..

rohit sharma comments on ravishashtri
rohit sharma comments on ravishashtri

By

Published : Mar 8, 2023, 10:32 PM IST

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్​లో టీమ్​ఇండియా ఓటమికి జట్టుపై వచ్చిన విమర్శలపై కెప్టెన్​ రోహిత్ శర్మ స్పందించాడు. అవన్నీ ఉపయోగం లేని ఆరోపణలు అని తిప్పికొట్టాడు. మొదటి రెండు మ్యాచ్​లు గెలిచామని.. అయినా ఇలా అనడం సరికాదని హితవు పలికారు. ఏదీ ఆలోచించకుండా ప్రత్యర్థి జట్టు చెలరేగడమే తమ ప్లేయర్ల పద్ధతి అని.. దాన్ని వారు ఓవర్​ కాన్ఫిడెన్స్ అనుకుంటే తానేమీ చేయలేమని చెప్పాడు.

'అదంతా రబ్బిష్'​..
కాగా, మొదటి రెండు టెస్టులు గెలవడం వల్ల టీమ్ఇండియా ప్లేయర్లకు విజయ గర్వం తలకెక్కిందని.. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగి ఓడిపోయారని భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి లాంటి మాజీలు విమర్శించారు. అయితే, అహ్మదాబాద్ వేదికగా గురువారం నుంచి చివరి టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రోహిత్ శర్మ బుధవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి విలేకరులు ప్రస్తావించగా.. ఘాటుగా స్పందించాడు. 'తొలి రెండు టెస్టులు గెలిచిన తర్వాత కూడా ఆటగాళ్లు ఓవర్​ కాన్ఫిడెన్స్​తో ఉన్నారనేది చర్చ రబ్బిష్​' అని కొట్టి పాడేశాడు.

"ప్రతర్థి జట్టు అంటే కనికరం(రూత్​లెస్​గా) లేకుండా.. ఆడాలని ప్రతీ క్రికెటర్ అనుకుంటాడు. ప్రత్యర్థి టీమ్​కు ఏ మాత్రం అవకాశం ఇవ్వద్దనే ఆలోచనతో ప్లేయర్స్​ ఆడతారు. మేం కూడా అదే మైండ్‌సెట్‌తో ఆడుతున్నాం. ఇది ఇతరులకు ఓవర్​ కాన్ఫిడెన్స్​లా అనిపిస్తే మేము ఏం చేయలేం. చివరి టెస్టుకు భారత్​-ఆస్ట్రేలియా ప్రధానులు వస్తున్నారు. వారి సమక్షంలో మ్యాచ్ ఆడనున్నాం అంటే.. చాలా ఉత్సాహంగా ఉంది. ఆటగాళ్ల‌కు మ్యాచ్ గెలవడమే ముఖ్యం. ఎలాంటి పిచ్‌లోనైనా.. ప్రతికూల పరిస్థితుల్లోనైనా పరుగులు చేసే మార్గాలను కనుక్కుంటూ ఆడాలి. టెస్టు మ్యాచ్‌లో పరిస్థితులను పట్టించుకోకుండా.. పరుగులు సాధించడానికి మార్గాలు కనుక్కొవాలని జట్టు ప్లేయర్లకు చెప్పాను. మూడో మ్యాచ్​లో మేం అనుకున్నట్టు బ్యాటింగ్​ చేయలేకపోయాం. అందుకే ఓడిపోయాం. నేను బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రత్యర్థిపై పై చేయి సాధించేందుకు ట్రై చేస్తాను. నేను ఎలా బ్యాటింగ్​ చేస్తాను అనే దానికి.. నా నాగ్‌పూర్ ఇన్నింగ్సే ఉదాహరణ"

-- రోహిత్​ శర్మ, టీమ్ఇండియా కెప్టెన్

వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ఆస్ట్రేలియా ఇప్పటికే అర్హత సాధించగా.. మరో బెర్త్‌ కోసం భారత్‌, శ్రీలంక మధ్య పోటీ నెలకొంది. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టులో టీమ్ఇండియా విజయం సాధిస్తే.. శ్రీలంక, న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌ ఫలితంతో సంబంధం లేకుండా నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్‌ దూసుకెళ్తుంది. ఒకవేళ ఇండియా, ఆసీస్‌ మధ్య జరిగే నాలుగో టెస్టు డ్రా అయి.. న్యూజిలాండ్‌పై శ్రీలంక 2-0 తేడాతో సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేస్తే టీమ్‌ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్​ అడే ఆశలు గల్లంతవుతాయి. కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ మొదటిరోజు ఆటను ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని అంథోనీ అల్బనీస్ కలిసి వీక్షించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details