టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్(Shoaib Akthar on Rohit Sharma). భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ కంటే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మనే(Shoaib Akthar on India) పాకిస్థాన్ అభిమానులు ఎక్కువగా ఇష్టపడతారని పేర్కొన్నాడు. తమ దేశ క్రికెట్ అభిమానులు రోహిత్‌ను 'ఇండియా కా ఇంజమామ్' అని అభివర్ణిస్తారని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ సందర్భంగా భారత్, పాకిస్థాన్ హై వోల్టేజీ మ్యాచ్(Ind vs Pak T20 World Cup) మరో రెండు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో అక్తర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
"భారత్‌కు మంచి క్రికెట్ జట్టు లేదని చెప్పే వారెవరూ పాకిస్థాన్‌లో లేరు. విరాట్ ఓ గొప్ప ఆటగాడని, రోహిత్ ఎవర్గ్రీన్ ఆటగాడని వారు భావిస్తారు. రోహిత్‌ను వారు 'ఇండియా కా ఇంజమామ్ ఉల్ హక్' అని పిలుస్తారు. ఆస్ట్రేలియాలో రిషబ్ పంత్ ఆడిన తీరును వారు మెచ్చుకుంటారు. సూర్యకుమార్ యాదవ్‌నూ ప్రశంసిస్తారు. పాకిస్థాన్ ప్రేక్షకులకు ఇండియా ఆటగాళ్లపై మంచి అభిప్రాయం ఉంది."
--షోయబ్ అక్తర్, పాకిస్థాన్ మాజీ ఆటగాడు.