న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు టీమ్ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. కివీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ 105 పరుగులు చేశాడు. దీంతో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులు చేయగలిగింది. అయితే అరంగేట్ర టెస్టులోనే శ్రేయస్ సెంచరీ చేయడంపై మాజీలు, అభిమానుల నుంచి సహ ఆటగాళ్ల వరకు అతడిని ప్రశంసల జల్లుతో ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో భారత టీ20 సారథి రోహిత్ శర్మ కూడా శ్రేయస్ ఆటతీరును మెచ్చుకున్నాడు.
శ్రేయస్ సెంచరీ.. రోహిత్ డ్యాన్స్ వీడియో వైరల్ - శార్దుల్ ఠాకూర్ డ్యాన్స్ వీడియో
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు(IND vs NZ test)లో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో అతడి బ్యాటింగ్ తీరుపై ప్రశంసల జల్లు కురిపించాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే శ్రేయస్, శార్దుల్ ఠాకుర్‌తో పాటు అతడు డ్యాన్స్(Rohit Sharma Dance Video) చేసిన ఓ వీడియోను నెట్టింట షేర్ చేశాడు.
Rohit Sharma Dance Video: శ్రేయస్, శార్దూల్ ఠాకుర్‌తో పాటు తాను డ్యాన్స్ చేసిన ఓ వీడియోను నెట్టింట షేర్ చేశాడు రోహిత్. ఫేమస్ బాలీవుడ్ సాంగ్ 'చమ్ చమ్ నచ్దీ ఫిరాన్' అనే సాంగ్‌కు వీరంతా కాలు కదిపారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ.. 'చాలా బాగుంది. సరైన విధంగా కాలు కదిపావు' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు హిట్‌మ్యాన్. ఈ డ్యాన్స్ లాగే సెంచరీ కూడా అద్భుతమంటూ చెప్పాడు.
కాగా.. కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు(IND vs NZ test)లో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 345 పరుగులు చేయగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. ఓపెనర్లు లాథమ్ (50*), విల్ యంగ్ (75*) అద్భుతంగా ఆడుతున్నారు.