ఇంగ్లాండ్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ(rohith sharma century in england) అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ గడ్డపై దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ సాధించిన ఎక్కువ సెంచరీల(8) రికార్డును అధిగమించాడు. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన హిట్‌మ్యాన్ ఈ మార్క్‌తో ప్రత్యర్థి జట్టు గడ్డపై అత్యధిక శతకాలు(9) చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లెజండరీ బ్యాట్స్‌మన్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ 11 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.
రోహిత్.. ఈ సెంచరీతో పాటు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటంటే..
- అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మట్లలో కలిపి 15వేల పరుగులు
- టెస్టు ఫార్మాట్లో 3 వేల పరుగుల మార్క్
- విదేశాల్లో అతడికి ఇదే తొలి టెస్టు శతకం
- ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్లో 11వేల పరుగులు
- 2021లో అంతర్జాతీయ క్రికెట్లో వెయ్యి రన్స్
- ఇప్పటివరకు ఇంగ్లాండ్‌లో రెండు వేల పరుగులు