తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ కన్నా రోహిత్​ గొప్ప కెప్టెన్​.. ఎందుకంటే? - రోహిత్​ శర్మ

Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్​ శర్మపై ప్రశంసల జల్లు కురుస్తొంది. విరాట్​ కోహ్లీ కన్నా రోహిత్​ శర్మ గొప్ప టెస్టు కెప్టెన్​ అవుతాడని భారత మాజీ క్రికెటర్​ వసీం జాఫర్ అన్నాడు​. రోహిత్​లో కెప్టెన్​కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయన్నాడు మరో క్రికెటర్​ సబా కరీమ్​. శ్రీలంకతో సిరీస్​ విజయం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.

Rohit Sharma-virat kohli
కోహ్లీ కన్నా రోహిత్​ గొప్ప కెప్టెన్

By

Published : Mar 16, 2022, 1:59 PM IST

Rohit Sharma: టీమ్​ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ప్రశంసించాడు. విరాట్‌ కోహ్లి కన్నా రోహిత్‌ గొప్ప టెస్టు కెప్టెన్‌ అవుతాడని కొనియాడాడు. ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ ఇన్ఫోతో మాట్లాడిన జాఫర్​ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

విరాట్‌ కోహ్లి కంటే రోహిత్​ మెరుగైన టెస్టు కెప్టెన్‌ అవుతాడు. అతడు ఎన్ని టెస్టులకు సారథ్యం వహిస్తాడో తెలియదు కానీ, అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలవడం ఖాయం. వరుస సిరీస్‌లను వైట్‌వాష్‌ చేయడం చూస్తుంటే.. భారత జట్టు సరైన కెప్టెన్​ చేతిలో ఉందని అనుకుంటున్నాను.

-వసీం జాఫర్​, భారత మాజీ ఓపెనర్​

భారత కెప్టెన్​ రోహిత్​ శర్మను ప్రశంసించాడు మాజీ క్రికెటర్​ సబా కరీమ్​. శ్రీలంకతో టెస్టు సిరీస్​ విజయంపై స్పందించిన అతడు.. రోహిత్​ కెప్టెన్సీని కొనియాడాడు.

రోహిత్​ శర్మ చేస్తున్న ప్రకటనల్లో, కెప్టెన్సీలో పూర్తి స్వేచ్ఛ కనిపిస్తుంది. ఇది మంచి విషయం. బాగా ఆడినపుడు ప్రశంసించడం.రాణించనపుడు విమర్శించకుండా మరో విధంగా తెలపాలని ఆటగాళ్లు కోరుకుంటారు. ఒక ఆటగాడు కెప్టెన్​ నుంచి ఆశించేది ఇదే. ఈ లక్షణాలన్నీ రోహిత్​లో కనిపిస్తున్నాయి. రోహిత్​, ద్రవిడ్​ల జోడి భారత జట్టు విజయాలకు మరింత కృషి చేస్తుంది. కానీ విదేశాలకు వెళ్లినపుడు ఈ జోడి తమ సత్తాను చాటుకోవాలి.

-సబా కరీమ్​, భారత మాజీ క్రికెటర్​

దక్షిణాఫ్రికా పర్యటనలో ఘోర పరాభవం తర్వాత కోహ్లి టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. 68 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కోహ్లీ 40 విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 59 శాతం విజయాలను నమోదు చేశాడు. రోహిత్‌ నేతృత్వంలోని భారత జట్టు వరుసగా న్యూజిలాండ్‌తో టీ20, వెస్టిండీస్‌తో వన్డే, టీ20, శ్రీలంకతో టీ20, టెస్టు సిరీస్‌లను వైట్‌వాష్‌ చేసింది.

ఇదీ చదవండి:Virat Kohli: 'కోహ్లీ.. ఫామ్​లోకి రావాలంటే అక్కడికి రా'

ABOUT THE AUTHOR

...view details