తెలంగాణ

telangana

ETV Bharat / sports

2 రోజుల్లోనే మళ్లీ టాప్​లోకి హిట్​మ్యాన్​.. పాపం గప్తిల్​!

Rohith Sharma Record: అంతర్జాతీయ టీ20ల్లో టీమ్​ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్​లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కివీస్​ బ్యాటర్ గప్తిల్‌ను అధిగమించి మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. మరోవైపు, టీ20ల్లో 23 ఇన్నింగ్స్​ల తర్వాత శుక్రవారం జరిగిన మ్యాచ్​లో రోహిత్​.. తొలి హాఫ్​ సెంచరీ బాదాడు.

rohithsharma record
rohithsharma record

By

Published : Jul 30, 2022, 9:13 AM IST

Rohith Sharma Record: టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డు ఇద్దరు టాప్ బ్యాటర్ల మధ్య దోబూచులాడుతోంది. ఇటీవలే రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టి నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు కివీస్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్. అయితే రెండు రోజులు కూడా ఆ ఆనందాన్ని ఆస్వాదించకముందే హిట్​మ్యాన్​ మళ్లీ దానిని లాగేసుకున్నాడు.

పొట్టి ఫార్మాట్​లో అత్యధిక పరుగుల రికార్డు గతంలో రోహిత్ పేరిటే ఉండేది. కానీ రెండు రోజుల క్రితం స్కాట్లాండ్​తో జరిగిన తొలి టీ20లో గప్తిల్ ఈ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. గప్తిల్.. ఇండియా-వెస్టిండీస్ మ్యాచ్​కు ముందు 3,399 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. కానీ ఈ మ్యాచ్​లో రోహిత్.. 44 బంతుల్లో 64 పరుగులు చేసి మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. 21 పరుగులు చేశాక రోహిత్.. గప్తిల్​ను అధిగమించాడు.

రోహిత్​ శర్మ

ప్రస్తుతం ఈ జాబితాలో రోహిత్ శర్మ 129 మ్యాచులు ఆడి 3,443 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. 116 మ్యాచుల్లో 3,399 పరుగులు సాధించి గప్తిల్ రెండో స్థానంలో ఉన్నాడు. అయితే గప్తిల్-రోహిత్​ల అగ్రస్థానం కొట్లాట మరికొన్ని రోజులు తప్పేటట్టు లేదు. ఎందుకంటే ఇరు జట్లు వీలైనన్ని ఎక్కువ టీ20లు ఆడనున్న నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య ఆధిపత్యం చేతులు మారనుందని క్రీడా నిపుణులు అంటున్నారు.

హిట్ మ్యాన్.. 23 ఇన్నింగ్స్​ల తర్వాత ఈ మ్యాచ్​లో అర్ధ సెంచరీ సాధించాడు. చివరిసారిగా అతడు.. టీ20 ప్రపంచకప్ ముగిశాక న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో హాఫ్​ సెంచరీ బాదాడు. ఈ ఏడాది టీ20ల్లో (అంతర్జాతీయ, ఐపీఎల్) అతడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం.

1000 పరుగులు చేసిన తొలి బ్యాటర్​గా..
టీమ్​ఇండియా వికెట్‌ కీపర్‌ రిషభ్​ పంత్‌ మరో అరుదైన ఫీట్‌ నమోదు చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో 14 పరుగులు చేయడం ద్వారా ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో(అన్ని ఫార్మాట్లలో) భారత జట్టు తరఫున వెయ్యి పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్​కు ముందు పంత్.. 988 పరుగులతో ఉన్నాడు. విండీస్​తో తొలి టీ20లో నాలుగో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చిన అతడు.. 12 బంతుల్లో 14 పరుగులు చేసి పెవిలియన్​ చేరాడు.

ఇవీ చదవండి:రికార్డుల వేటలో టీమ్​ఇండియా ఆటగాళ్లు.. జట్టులోకి సంజూ శాంసన్‌

IND vs WI: విజృంభించిన భారత బౌలర్లు.. తొలి టీ20లో విండీస్‌ చిత్తు

ABOUT THE AUTHOR

...view details