రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమ్‌ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అతడు ఫిబ్రవరిలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌తో పాటు ఏప్రిల్‌లో మొదలయ్యే ఐపీఎల్‌కు కూడా దూరం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి పంత్ స్థానంలో మరో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లను ఎంచుకోవడం ఇప్పుడు సెలెక్షన్ కమిటీకి సవాలుగా మారింది.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి పంత్ దూరం.. వికెట్ కీపర్‌గా వారిద్దరికీ ఛాన్స్! - రిషబ్ పంత్ క్రికెట్
పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడటం వల్ల అతడి స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్లను ఎంచుకోవడం ఇప్పుడు సెలెక్షన్ కమిటీకి సవాలుగా మారింది. దీంతో అతన్ని రిప్లేస్ చేసే వ్యక్తి కోసం కమిటీ సన్నాహాలు చేస్తోంది.
అయితే ఈ స్థానం కోసం ప్రధానంగా ముగ్గురి మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి ఈ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. వైట్‌బాల్ స్పెషలిస్టు ఇషాన్ కిషన్‌తోపాటు ఇండియా ఏ కీపర్లు కేఎస్ భరత్, ఉపేంద్ర యాదవ్‌ల పేర్లను కొత్త సెలెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోవచ్చు. భరత్, ఉపేంద్రలను నేరుగా జట్టులో స్థానం కల్పించవచ్చు. లేదా డ్యాషింగ్ లెఫ్ట్‌హ్యాండర్ ఇషాన్‌కు అవకాశం ఇవ్వొచ్చు. సాకేతికంగా చూసుకుంటే.. సెకండ్ కీపర్‌గా ఉన్న భరత్.. నాగ్‌పూర్ టెస్టులో అరగేంట్రం చేసే అవకాశాలు ఉన్నాయి.
అయితే.. ఉపేంద్రకు మెరుగైన గణాంకాలు ఉన్నాయి. మంచి కీపింగ్ నైపుణ్యాలతోపాటు 45కు పైగా యావరేజ్‌తో పరుగులు చేస్తున్న అతడు హిట్టర్ కూడా. దీంతో సెలెక్షన్ కమిటీ ఎవరిని ఎంపిక చేసుకుంటుందో చూడాల్సి ఉంది.ఇక పంత్ పరిస్థితి చూసుకుంటే అతడు ఎంత కాలం క్రికెట్‌కు దూరం అవుతాడో తెలియని పరిస్థితి. అతడి నుదుటికి వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని దిల్లీ క్రికెట్ సంఘం డైరెక్టర్ శ్యామ్ శర్మ చెప్పాడు.