Richardson on ipl auction: రెండు రోజుల పాటు ఆసక్తిగా ఐపీఎల్ మెగా వేలం-2022 కొందరికి కాసుల వర్షం కురిపిస్తే.. మరికొందరిని నిరాశపరిచింది. సురేశ్ రైనా, షకీబ్ అల్ హసన్, ఇయాన్ మోర్గాన్ సహా పలువురు స్టార్ ఆటగాళ్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.
అయితే ఈ అన్‌సోల్డ్ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు జంపా, కేన్ రిచర్డ్‌సన్ కూడా ఉన్నారు. తాజాగా తమను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయకపోవడంపై రిచర్డ్‌సన్ స్పందించాడు. ఆడం జంపాను కొనకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు.
గతేడాది కరోనా కారణంగా ఐపీఎల్ మధ్యలోనే కొంతమంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. వీరిలో జంపా, కేన్ రిచర్డ్‌సన్ కూడా ఉన్నారు. ఈ కారణంగానే తమను ఈ సారి ఏ ఫ్రాంఛైజీ తీసుకోలేదని అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో తాము ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోవడమే ప్రాధ్యానంగా భావించినట్లు చెప్పుకొచ్చాడు. గతంలో వీరిద్దరు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించారు.
కాగా, ఈ మెగా వేలంలో తాను ఏ ఫ్రాంఛైజీతోనూ సంప్రదింపులు జరుపలేదని రిచర్డ్‌సన్ అన్నాడు. వ్యక్తిగత కారణాల వల్లే గత రెండు సీజన్లలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంలేకపోయినట్లు తెలిపాడు.
ఇదీ చదవండి:IND VS WI: ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు కలిసిన వేళ!