న్యూజిలాండ్ జట్టు తమ దేశ పర్యటనను రద్దు చేసుకోవడం వల్ల పాకిస్థాన్‌పై (NZ vs PAK) కోలుకోలేని దెబ్బ పడింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత 3 వన్డేలు, 5 టీ20ల కోసం కివీస్.. పాక్ గడ్డపై అడుగుపెట్టింది. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే వెనుదిరిగింది (New Zealand Tour of Pakistan Abandoned). భద్రతా కారణాల రీత్యా పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది.
ఈ సిరీస్‌కు (Pakistan vs New Zealand) ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అనేక ఏర్పాట్లు చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. కానీ, కివీస్ చర్యతో తీవ్ర అసంతృప్తికి గురైంది. ఇతర జట్లపైనా దీని ప్రభావం ఉంటుందని, న్యూజిలాండ్‌పై ప్రతీకార చర్యకు సిద్ధంగా ఉండాలని పాక్ మాజీ క్రికెటర్లు ఆగ్రహంవ్యక్తం చేశారు. అయితే కివీస్ పర్యటన రద్దుతో ఆర్థికంగానూ పీసీబీకి భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
బిర్యానీకే అంత!