తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ashwin Record In Test Cricket: టెస్టుల్లో అశ్విన్​ ఆరుదైన రికార్డు - అశ్విన్ రికార్డు

Ashwin Record In Test Cricket: టెస్టుల్లో టీమ్​ఇండియా స్పిన్​ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్​ అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ స్పిన్నర్​ హర్భజన్​ను వెనక్కినెట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి చేరాడు.

ashwin
అశ్విన్

By

Published : Nov 29, 2021, 2:34 PM IST

Updated : Nov 29, 2021, 8:39 PM IST

Ashwin Record In Test Cricket: టీటీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసిన అశ్విన్.. మాజీ దిగ్గజ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ (103 టెస్టుల్లో 417 వికెట్లు)ను అధిగమించాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌ అశ్విన్‌ (419)‌గా రికార్డుల్లోకెక్కాడు. 80 టెస్టుల్లోనే అశ్విన్‌ ఈ ఘనత సాధించడం విశేషం. భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే (619), మాజీ కెప్టెన్‌ కపిల్ దేవ్‌ (434) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.

అశ్విన్‌ సాధించిన ఘనతపై మాజీ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ స్పందించాడు. "నేను భారత్‌ తరఫున ఆడుతున్న సమయంలో అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నించాను. ప్రస్తుతం అశ్విన్‌ కూడా గొప్పగా రాణిస్తున్నాడు. మా ఇద్దరికీ పోలికలు అవసరం లేదు. అరుదైన మైలురాయిని చేరుకున్న రవిచంద్రన్‌ అశ్విన్‌కు శుభాకాంక్షలు. టీమ్‌ఇండియాకు అతడు మరెన్నో విజయాలు అందించాలని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నాడు.

Last Updated : Nov 29, 2021, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details