తెలంగాణ

telangana

ETV Bharat / sports

వచ్చే నెల నుంచి రంజీ మ్యాచ్​లు: బీసీసీఐ

Ranjji Trophy 2022: రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా చెప్పారు. వచ్చేనెల మొదటి వారం నుంచి తొలి దశ మ్యాచ్​లు జరుగుతాయని అన్నారు. రెండో ఫేజ్​ను జూన్​లో జరపనున్నట్లు పేర్కొన్నారు.

Ranjji Trophy
రంజీ ట్రోఫీ

By

Published : Jan 28, 2022, 1:30 PM IST

Ranjji Trophy 2022: రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గురువారం బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ చెప్పారు. ఆ మాటలను నిజం చేస్తూ.. శుక్రవారం బీసీసీఐ సెక్రటరీ జైషా రంజీ టోర్నీపై ప్రకటన చేశారు. వచ్చేనెల మొదటి వారం నుంచి మొదటి ఫేజ్​ను నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. రెండో ఫేజ్​ను జూన్​లో జరపనున్నట్లు తెలిపారు.

గత ఏడాది జరగాల్సిన మ్యాచ్​లను కరోనా కారణంగా రద్దు చేశారు. ఈ ఏడాది రంజీ టోర్నీని జనవరి 13 నుంచి నిర్వహించాలని భావించారు. కానీ ఒమిక్రాన్​ వ్యాప్తి నేపథ్యంలో దేశవాళీ టోర్నీలు వాయిదా వేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. మళ్లీ రెండు దఫాలుగా నిర్వహించాలనే ప్రతిపాదనతో నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే మార్చి 27 నుంచి ఐపీఎల్ మ్యాచ్​లు జరగనున్నాయి.

రంజీ ట్రోఫీ క్రికెట్​కు వెన్నెముక..

రంజీ ట్రోఫీలు భారత క్రికెట్​కు కీలకమైనదని అన్నారు టీమ్​ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి. ఈ దేశవాళీ ఆటలను విస్మరిస్తే క్రికెట్​కు వెన్నెముక లేకుండా పోతుందని చెప్పాడు. మార్చి 27 నుంచి ఐపీఎల్ నిర్వహించనున్న నేపథ్యంలో రంజీ ట్రోఫీ జరపడం కష్టమనే అభిప్రాయాలు వెలువడగా.. రవిశాస్త్రి ఈ మేరకు ట్వీట్ చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:BCCI on Ranji Trophy: 'రెండు దశల్లో రంజీ ట్రోఫీ నిర్వహణ'

ABOUT THE AUTHOR

...view details