ICC T20 Ranking Batsman: ఐసీసీ తాజాగా విడుదల చేసిన పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో టాప్-5కి చేరుకున్నాడు టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్. ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 5వ స్థానంలో(729 పాయింట్లు) నిలిచాడు. పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 4వ స్థానంలో(735 పాయింట్లు) కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ టాప్-10లో స్థానాన్ని కోల్పోయాడు. ఇతడు 11వ స్థానానికి పడిపోగా.. కివీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రోహిత్ శర్మ రెండు స్థానాలు ఎగబాకి 13వ(645 పాయింట్లు) స్థానంలో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ 24 స్థానాలు మెరుగై 59వ ర్యాంకుకు చేరాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 809 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ICC T20 RANKINGS:మెరుగైన రాహుల్ ర్యాంకు.. కోహ్లీ టాప్-10 గల్లంతు - ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ కేఎల్ రాహుల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన పురుషుల టీ20 ర్యాంకింగ్స్(ICC T20 Ranking)లో టాప్-5కి చేరుకున్నాడు టీమ్ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్. రోహిత్, దీపక్, భువనేశ్వర్ కూడా తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. విరాట్ కోహ్లీ టాప్-10లో చోటు కోల్పోయాడు.
Rahul
ICC T20 Ranking Bowler: బౌలర్ల విభాగానికి వస్తే న్యూజిలాండ్ స్పిన్నర్ మైఖేల్ సాంట్నర్ ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్థానానికి చేరుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 19వ, దీపక్ చాహర్ 19 స్థానాలు మెరుగై 40వ ర్యాంకులో నిలిచారు. శ్రీలంక బౌలర్ హసరంగ 797 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. భారత బౌలర్లలో ఒక్కరు కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు.