శ్రీలంకలో పర్యటించే భారత జట్టుకు రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) కోచ్‌గా ఉంటారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) స్పష్టం చేశారు. ఇటీవలే ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ద్రవిడ్‌తో కలిసి టి.దిలీప్, పరాస్ మహంబ్రే లంకకు వెళ్తారని సమాచారం. వీరంతా అండర్-19, భారత్-ఏ జట్లకు కోచులుగా పనిచేశారు. గతంలో అండర్-19, భారత్-ఏకు కోచ్‌గా మిస్టర్ డిపెండబుల్‌కు ఎంతో అనుభవం ఉంది. ఆటగాళ్లతో మంచి సాన్నిహిత్యం ఉంది. లంక పర్యటనకూ అప్పటి ఆటగాళ్లే ఎంపికవ్వడం వల్ల ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించినట్టు తెలిసింది.
IND Vs SL: కోచ్‌గా ద్రవిడ్.. దాదా క్లారిటీ - సౌరవ్ గంగూలీ
లంక పర్యటన(IND Vs SL)లో టీమ్ఇండియా కోచ్‌గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) వ్యవహరిస్తారని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. దాదాపుగా బీసీసీఐ వర్గాలూ అనేకసార్లు దీన్ని స్పష్టం చేశాయి. ఇప్పుడా విషయాన్ని బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) ధ్రువీకరించారు.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడేందుకు ఇప్పటికే టీమ్‌ఇండియా ఇంగ్లాండ్ చేరుకుంది. జూన్18న సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడనుంది. నెల రోజుల విరామం తర్వాత ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసు ఆడనుంది. ఇదే సమయంలో మరో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. నిజానికి ఈ పరిమిత ఓవర్ల సిరీసు గతంలో ఆడాల్సింది. కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ప్రత్యామ్నాయ ఆటగాళ్లు, టీ20 స్టార్లు అందుబాటులో ఉండటం వల్ల రెండో జట్టును బీసీసీఐ ఎంపిక చేసి శిఖర్ ధావన్‌ను సారథిగా ప్రకటించింది.
ఇదీ చూడండి..WTC Final: కోహ్లీసేనతో తలపడనున్న టీమ్ ఇదే