తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ఇండియా బౌలర్ ఆగ్రహం.. అంపైర్​పై కోపంతో.. - అంపైర్​పై రాహుల్ చాహర్ ఆగ్రహం

IND A vs SA A: టీమ్​ఇండియా ఏ, దక్షిణాఫ్రికా ఏ జట్ల మధ్య మ్యాచ్​ జరుగుతుండగా అంపైర్​పై ఆగ్రహం వ్యక్తం చేశాడు లెగ్​ స్పిన్నర్ రాహుల్ చాహర్. కోపం అదుపుచేసుకోలేక అంపైర్​తో గొడవ పెట్టుకున్నాడు.

rahul chahar
రాహుల్ చాహర్

By

Published : Nov 26, 2021, 1:51 PM IST

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టీమ్​ఇండియా-ఏ, సౌతాఫ్రికా-ఏ మ్యాచ్​లో(IND A vs SA A match) అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్(Rahul Chahar News)​ అంపైర్​తో దురుసుగా ప్రవర్తించాడు. కొద్దిసేపు వాగ్వాదానికి దిగాడు.

అసలేం జరిగిందంటే?

బ్లూమ్‌ఫోంటైన్‌ వేదికగా రెండో రోజు మ్యాచ్​ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్​లో రాహుల్​ 128వ ఓవర్ వేస్తున్నాడు. ఆ ఓవర్లో రాహుల్ విసిరిన బంతి.. క్రీజులో బ్యాటింగ్ చేస్తున్న క్యూషీలే ప్యాడ్స్​ను తాకింది. అది ఎల్బీడబ్ల్యూగా భావించిన రాహుల్​ వెంటనే అంపైర్​ను అప్పీల్ చేశాడు. అంపైర్​ ఔట్​గా పరిగణించని కారణంగా ఎమోషన్​ కంట్రోల్ చేసుకోలేకపోయిన రాహుల్.. తన సన్​గ్లాసెస్​ను నేలపైకి విసిరాడు. ఆ తర్వాత కొద్దిసేపు అంపైర్​తో వాగ్వాదానికి దిగాడు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​గా మారింది. రాహుల్ చాహర్​ ప్రవర్తనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

ఈ మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో దక్షిణాఫ్రికా ఏ జట్టు 509 పరుగులు చేసింది. బరిలోకి దిగిన టీమ్​ఇండియా ఏ జట్టు తొలి ఇన్నింగ్స్​లో నాలుగు వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ 96 పరుగులతో అదరగొట్టగా, అభిమన్యు ఈశ్వరన్ 103 పరుగులు చేశాడు. ఓపెనర్ పృథ్వీ షా 48 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు.

ఇదీ చదవండి:

తొలి టెస్టులో శ్రేయస్ సెంచరీ.. భారత 16వ క్రికెటర్​గా ఘనత

ABOUT THE AUTHOR

...view details