టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్(ODI world cup) గెలిస్తే ఒంటిపై బట్టల్లేకుండా పోజులిస్తానని, క్రికెటర్లనూ అలానే కలుస్తానని షాకింగ్ వ్యాఖ్యలు చేసిన నటి, మోడల్ పూనమ్ పాండే(Poonam pandey) గతంలో వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్(World Test Championship) జరుగుతున్న దృష్ట్యా మరోసారి అదే విషయం గురించి మాట్లాడింది.
ఇటీవల పలువురికి నిత్యావసరాలు దానం చేసిన పూనమ్పాండేను పలకరించిన మీడియా.. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ గురించి అడిగింది. దీంతో "క్రికెట్ జరుగుతుందా? ఇండియా గెలిస్తే మళ్లీ నేను న్యూడ్‌గా కనిపిస్తానని మీకు చెప్పాలా?. దీని గురించి నాకేం తెలియదు. ఇంటికెళ్లి ఈ కాంట్రవర్సీ గురించి ఆలోచిస్తాలే" అని పూనమ్ ఆ విషయాన్ని దాటవేసింది.