జూన్ నెలకుగానూ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'(Player of Month) అవార్డులను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC). పురుషుల విభాగంలో న్యూజిలాండ్ ఓపెనర్ డేవన్ కాన్వే (Devon Conway)ను ఈ అవార్డు వరించింది.
లార్డ్స్ వేదికగా జూన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ బాదేశాడు కాన్వే. తర్వాత జరిగిన రెండో టెస్టులోనూ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక భారత్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కివీస్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
మహిళల విభాగంలో..
ఇక మహిళల విభాగంలో ఇంగ్లాండ్ బౌలర్ సోఫీ ఎక్లిస్టోన్ (sophie ecclestone)ను ఈ అవార్డు వరించింది. బ్రిస్టోల్ వేదికగా భారత్‌తో జరిగిన ఏకైక టెస్టులో 8 వికెట్ల తేడాతో రాణించింది సోఫీ. తర్వాత జరిగిన వన్డే సిరీస్‌లో ఒక వికెట్‌తో మెరిసింది.
ఇక అవార్డు రేసులో భారత్ నుంచి యువ సంచలనం షెఫాలీ వర్మ, ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా నిలిచినప్పటికీ వారికి మొండిచేయే మిగిలింది. పురుషుల విభాగంలో కివీస్ ఆల్‌రౌండర్ జేమీసన్, దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్ డికాక్ ఈ రేసులో నిలిచారు. కానీ కాన్వే వారికంటే ముందంజలో నిలిచి అవార్డు దక్కించుకున్నాడు.
ఇదీ చదవండి:IND vs PAK: 'ఒత్తిడిని ఎదుర్కోవాలంటే భారత్‌తో ఆడాలి'