అవినీతి ఆరోపణల నేపథ్యంలో జీషన్ మాలిక్ అనే క్రికెటర్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సస్పెండ్ చేసింది. పీసీబీకి చెందిన అవినీతి నిరోధక విభాగం ఈ విషయంపై విచారణ జరిపేంత వరకు సదరు క్రికెటర్ ఎలాంటి క్రీడాకార్యక్రమాల్లో పాల్గొనరాదని ఆదేశించింది. అయితే ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోన్న నేపథ్యంలో ఇతర వివరాలను పీసీబీ వెల్లడించలేదు.
టీ20 ప్రపంచకప్‌కు ముందు పాక్ క్రికెటర్ సస్పెండ్
టీ20 ప్రపంచకప్‌కు ముందు ఓ పాకిస్థాన్ క్రికెటర్ సస్పెండ్‌కు గురయ్యాడు. అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణల నేపథ్యంలో అతడిపై విచారణకు పీసీబీ ఆదేశించింది. పీసీబీ అవినీతి నిరోధక విభాగం విచారణ పూర్తయ్యే వరకు సదరు ఆటగాడు ఎలాంటి క్రీడాకార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలులేదు.
టీ20 ప్రపంచకప్‌కు ముందు పాక్ క్రికెటర్ సస్పెండ్
పీసీబీ నిబంధనల్లోని ఆర్టికల్ 4.7.1(a) ప్రకారం క్రికెటర్ అవినీతికి పాల్పడితే సదరు ఆటగాడిపై చర్యలు తీసుకునే హక్కు పీసీబీకి ఉంటుంది. లేదా రూల్ 4.7.1(b) ప్రకారం క్రికెటర్‌పై ఉన్న అభియోగాలపై అవినీతి నిరోధక శాఖ సమగ్ర దర్యాప్తు చేసేంత వరకు సదరు క్రికెటర్‌ను సస్పెండ్ చేస్తుంది. అదే విషయాన్ని క్రికెట్ బోర్డు.. అంతర్జాతీయ క్రికెట్ మండలికి తెలియజేస్తుంది.
ఇదీ చూడండి..ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించిన దినేశ్ కార్తిక్