Pant Health Update : వన్డే ప్రపంచకప్ - 2023కు ముందు టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త అందింది. గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్.. అనుకున్న సమయం కన్నా త్వరగానే కోలుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అతడు పూర్తి ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్నాడట. బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్లో పునరావాసం పొందుతున్నాడు.
ఇక నో సర్జరీ..రోడ్డు ప్రమాదానికి గురైన అతడికి వైద్యులు పలు సర్జరీలు చేశారు. దీంతో అతడు ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలోనే అతడికి మరో మైనర్ సర్జరీ అవసరమని మొదట వైద్యులు సూచించారు. కానీ ఇప్పుడు పంత్ మరింత మెరుగ్గా కోలుకోవడం వల్ల.. అతడి మరో సర్జరీ అవసరం లేదని వైద్యులు భావించారట. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
Pant Health Condition : "పంత్‌కు ఇప్పటికే పలు సర్జరీలు చేశారు. అయితే అతడికి మరో మైనర్ సర్జరీ చేయాలని మొదట వైద్యులు ఉన్నారు. అతడిని ప్రతి పదిహేను రోజులకు ఓసారి వైద్యులు పరిశీలిస్తూనే ఉన్నారు. అతడు బాగా కోలుకుంటున్నాడు. అందుకే అతడికి మరో ఎటువంటి సర్జరీలు అవసరం లేదని ఇప్పుడు వైద్యలు అన్నారు. ఇది చాలా మంచి విషయం. పంత్ మొదట ఊహించిన దానికన్నా.. ముందుగానే మైదానంలో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి" అని ఓ బీసీసీఐ సీనియర్ అధికారి అన్నారు.