పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారీ టీమ్ఇండియా-జింబాబ్వే మ్యాచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా నవంబర్ 6న ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో జింబాబ్వే.. భారత్‌ను చిత్తుగా ఓడిస్తే ఆమె ఆ దేశపు వ్యక్తిని పెళ్లాడుతానని చెప్పింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది. 'తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వే అద్భుతంగా భారత్‌ను ఓడించినట్లైతే.. నేను ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను' అని తెలిపింది.
టీమ్ఇండియాను ఓడిస్తే అతడిని పెళ్లి చేసుకుంటా: హీరోయిన్
పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారి టీమ్ఇండియాపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. జింబాబ్వే.. టీమ్ఇండియాను ఓడిస్తే ఆ దేశపు వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది.
కాగా, గతంలో కూడా ఈ పాకిస్థాన్ నటి.. భారత్ జట్టుపై అక్కసు వెళ్లగక్కుతూ వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచింది. స్వదేశంలో టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయినప్పుడు కూడా భారత జట్టుపై విమర్శలు చేసింది. ప్రస్తుతం ఈ నటి చేసిన ట్వీట్లు నెట్టింట్లో విమర్శలకు దారి తీసింది. క్రికెట్ ప్రేమికులు, భారత్ అభిమానులు ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు.
ఇదీ చూడండి:'బౌలర్స్ బీ కేర్‌ఫుల్.. దాని గురించి సూర్యకు బాగా తెలుసు'