దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత బంగ్లాదేశ్లో పర్యటించనుంది పాకిస్థాన్ క్రికెట్ జట్టు. బంగ్లాతో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మంగళవారం ప్రకటించింది. నవంబర్, డిసెంబర్లలో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్ను ఢాకా, ఛత్తోగ్రామ్ వేదికగా నిర్వహించనున్నారు.
యూఏఈలో నవంబర్ 14న టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే పాక్ జట్టు బంగ్లాకు పయనంకానుంది. నవంబర్ 19న రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. అనంతరం ఛత్తోగ్రామ్లో నవంబర్ 26-30 మధ్య తొలి టెస్టు ఆడనున్నాయి. 2015 మే తర్వాత బంగ్లా గడ్డపై పాక్ టెస్టు మ్యాచ్ ఆడలేదు.