తెలంగాణ

telangana

ETV Bharat / sports

విండీస్​ టూర్​కు ఇంగ్లాండ్ స్టార్స్​ దూరం.. ఫ్యాన్స్​ అసహనం - james anderson latest news

యాషెస్​ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ జట్టులో కీలక మార్పులు జరిగాయి. వెస్టిండీస్​తో టెస్టు​ సిరీస్​కు దిగ్గజ బౌలర్లు జేమ్స్​ అండర్సన్​, స్టువర్ట్ బ్రాడ్​ను పక్కన పెట్టింది. దీంతో కొన్నేళ్లుగా తమ బౌలింగ్​లో సమర్థంగా రాణిస్తున్నవారిని ఈ సిరీస్​కు ఎంపిక చేయకపోవడంపై అభిమానులు ఆశ్చర్యంతో పాటు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Anderson, Broad
Anderson, Broad

By

Published : Feb 9, 2022, 11:50 AM IST

James Anderson News: ఇంగ్లాండ్​ టెస్టు జట్టుకు ఆ ఇద్దరు బౌలర్లు ఎంతో కీలకం. కొన్నేళ్లుగా ఇంగ్లీష్​ జట్టు పేస్​ దళం సమర్థంగా రాణిస్తుందంటే.. అందుకు కారణం వారిద్దరే కారణమని చెప్పొచ్చు! వారి బౌలింగ్​ నైపుణ్యంతో ఎన్నోకీలక విజయాలను ఆ జట్టుకు అందించారు. తమ బౌలింగ్​కు తిరుగులేదనిపించుకున్నారు. అందులో ఒకరు అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మూడో బౌలర్​ కాగా.. మరొకరు తన బౌలింగ్ నైపుణ్యంతో జట్టులో కీలకంగా రాణిస్తున్నారు. వారే జేమ్స్ అండర్సన్​, స్టువర్ట్​ బ్రాడ్.

ఇంగ్లాండ్ వెస్టిండీస్ టూర్-2022

అంతటి దిగ్గజాలను పక్కనపెట్టి ఈ నెల 24న వెస్టిండీస్​ పర్యటనకు వెళ్లనుంది ఇంగ్లాండ్. దీంతో వారి అభిమానుల్లో ఎన్నో అనుమాలు తలెత్తుతున్నాయి. తాత్కాలికంగా పక్కన పెట్టిందా? శాశ్వతంగా పక్కన పెట్టిందా? అన్న సందిగ్ధంలో పడ్డారు అండర్సన్, బ్రాడ్ ఫ్యాన్స్​. వీరినే కాకుండా హెడ్​ కోచ్​తో పాటు ఎనిమిది మందిని ఈ పర్యటనకు దూరం పెట్టింది. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన యాషెస్​ టెస్ట్​ సిరీస్​లో​ ఇంగ్లాండ్​ పేలవ ప్రదర్శన(4-0) చేసింది.

ఇప్పుడు యాషెస్​ టెస్ట్​ సిరీస్​ ప్రదర్శన ఆధారంగానే.. ఇంగ్లాండ్​ జట్టులో సమూల మార్పులు చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే.. హెడ్​కోచ్​, అసిస్టెంట్ కోచ్​, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్, వైస్​కెప్టెన్​ జాస్​ బట్లర్ సహా ఎనిమిది మందిని విండీస్ పర్యటనకు దూరం పెట్టింది. ఆ టూర్​కు తాజాగా ప్రకటించిన జట్టులో ఈ దిగ్గజాల పేర్లు లేకపోవడం వల్ల అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే 39 ఏళ్ల వయసున్న అండర్సన్‌ ఇంగ్లాండ్‌ టెస్టు జట్టులో కీలక పేసర్‌గా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు మొత్తం 169 టెస్టులు ఆడి, 640 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 39 ఏళ్ల బ్రాడ్.. 152 టెస్టుల్లో 537 వికెట్లు తీశాడు. యాషెస్​ టెస్ట్​ సిరీస్​లోనూ వీరిద్దరూ రాణించారు.

ఇంగ్లాండ్​ జట్టు..

జో రూట్​ (కెప్టెన్​), జొనాథన్​ బెయిర్‌స్టో, జాక్​ క్రాలే, మాథ్యూ ఫిషర్, బెన్​ ఫోక్స్, డాన్​ లారెన్స్​, జాక్​ లీచ్​, అలెక్స్​ లీస్​, షకీబ్​ మహమూద్​, క్రెయిగ్​​ ఓవర్టన్​, మాథ్యూ పార్కిన్‌సన్​, ఓలీ పోప్​, ఒల్లీ రాబిన్సన్​, బెన్​ స్టోక్స్​, క్రిస్​ వోక్స్​, క్రిస్​ వోడ్​

ఇదీ చూడండి:Saha team india: టెస్టులకు పక్కన పెట్టిన బీసీసీఐ.. సాహా కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details