తెలంగాణ

telangana

ETV Bharat / sports

eng vs ind: 'కోహ్లీసేనకు ఆ విషయం బాగా తెలుసు'

క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం, తిరిగి పోరాడటం కోహ్లీ సారథ్యంలోని టీమ్​ఇండియాకు చాలా బాగా తెలుసని అన్నాడు ఇంగ్లాండ్ హెడ్​ కోచ్ క్రిస్ సిల్వర్​వుడ్. భారత్​పై ఒత్తిడి తీసుకురావడంలో తమ జట్టు (eng vs ind) విఫలమైందని చెప్పాడు.

virat Kohli
విరాట్ కోహ్లీ

By

Published : Sep 7, 2021, 6:23 PM IST

Updated : Sep 7, 2021, 7:41 PM IST

కఠిన పరిస్థితుల నుంచి పుంజుకొని.. పోరాడటం విరాట్ కోహ్లీ నేతృత్వంలోనే టీమ్​ఇండియాకు బాగా తెలుసని అన్నాడు ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ క్రిస్ సిల్వర్​వుడ్. ఇంగ్లాండ్​పై ఓవల్​ టెస్టులో టీమ్​ఇండియా (eng vs ind) చారిత్రక విజయం సాధించిన అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"టీమ్​ఇండియాపై ఒత్తిడి పెంచే అవకాశం వచ్చినా మేం ఆ పని చేయలేకపోయాం. అయితే భారత క్రికెటర్లకు క్రెడిట్​ ఇవ్వాలి. వారికి తిరిగి పోరాడటం తెలుసు."

- క్రిస్ సిల్వర్​వుడ్, ఇంగ్లాండ్ హెడ్ కోచ్

157 పరుగుల తేడాతో నాలుగో టెస్టులో ఇంగ్లాండ్​ను చిత్తుగా ఓడించింది టీమ్​ఇండియా. తొలి నుంచి పోటాపోటీగా సాగిన మ్యాచ్​లో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఆఖరి రోజున దానిని చేజార్చుకుంది ఇంగ్లీష్ జట్టు. 368 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన రూట్​ సేనకు.. రెండో ఇన్నింగ్స్​లో శుభారంగమే దక్కింది. వికెట్​ నష్టపోకుండా 100 పరుగులు చేసిన ఇంగ్లాండ్​ను టీ అనంతరం మరో 40 నిమిషాల్లోనే 210 పరుగుల వద్ద ఆలౌట్​ చేసింది టీమ్​ఇండియా.

ఇవీ చూడండి:

WTC points Table: ఇంగ్లాండ్​పై విజయం.. అగ్రస్థానంలో భారత్

'ప్రపంచంలోనే భారత్ అత్యుత్తమ జట్టు'

Last Updated : Sep 7, 2021, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details