తెలంగాణ

telangana

ETV Bharat / sports

ODI World Cup 2023 : చరిత్ర సృష్టించిన కుశాల్ మెండిస్.. పాకిస్థాన్​పై ఫాసెస్ట్​ సెంచరీ - కుశాల్ మెండిస్ ఫాసెస్ట్​ సెంచరీ

ODI World Cup 2023 Kusal Mendis Century : ప్రపంచకప్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో పాకిస్థాన్​తో జరుగుతున్న మ్యాచ్​లో శ్రీలంక ప్లేయర్​ కుశాల్‌ మెండిస్‌ మెరుపు సెంచరీతో అదరగొట్టాడు.

ODI World Cup 2023 : చరిత్ర సృష్టించిన కుశాల్ మెండిస్.. పాకిస్థాన్​పై ఫాసెస్ట్​ సెంచరీ
ODI World Cup 2023 : చరిత్ర సృష్టించిన కుశాల్ మెండిస్.. పాకిస్థాన్​పై ఫాసెస్ట్​ సెంచరీ

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 5:23 PM IST

ODI World Cup 2023 Kusal Mendis Century :వరల్డ్ కప్​లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో చివరి మ్యాచ్‌ జరుగుతోంది. పాకిస్థాన్‌ - శ్రీలంక జట్లు ఈ మ్యాచ్‌లో పోటీపడుతున్నాయి. మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన శ్రీలంక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు గట్టి పోటీ ఇస్తోంది. లంక ప్లేయర్​ కుశాల్‌ మెండిస్‌.. అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 40 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న అతడు మరో 25 బంతుల్లోనే మూడంకెల స్కోరు అందుకున్నాడు. కేవలం 65 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో అదరగొట్టాడు. అలాగే ఓ అరుదైన ఘనత కూడా సాధించాడు.

వన్డే వరల్డ్ కప్​లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన శ్రీలంక ఆటగాడిగా రికార్డ్​కెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం కుమార సంగర్కర పేరిట ఉండేది. 2015 వరల్డ్​కప్​లో ఇంగ్లాండ్​పై 70 బంతుల్లో సంగర్కర శతకం బాదాడు. తాజా మ్యాచ్‌తో సంగర్కర రికార్డును మెండిస్‌ అధిగమించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 77 బంతులు ఎదుర్కొన్న మెండిస్‌.. 14 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 122 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. హసన్‌ అలీ వేసిన 29 ఓవర్‌లో మూడు, నాలుగు బంతులకు వరుసగా రెండు సిక్సర్లు బాదిన అతడు.. తర్వాతి బంతికే ఇమాన్‌ ఉల్‌ హక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ODI World Cup 2023 PAK VS Srilanka :కాగా, ఈ మ్యాచ్​లో టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 41 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్ కుశాల్ మెండిస్ (122; 77 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్స్‌లు) పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సధీరా సమరవిక్రమ (85*; 32 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌) నిలకడగా ఆడుతున్నాడు. ఓపెనర్ పాథుమ్ నిశాంక (51; 61 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ కుశాల్ పెరీరా (0) విఫలమయ్యాడు.

ABOUT THE AUTHOR

...view details