ఐపీఎల్-2021 విజేతగా(ipl 2021 winner) నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings 2021) నాలుగోసారి ట్రోఫీ ముద్దాడింది. ధోనీ(ms dhoni ipl) సారథ్యంలో ఎన్నో ఘనతల్ని సాధించింది. ఈ నేపథ్యంలో స్పందించిన బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, సీఎస్కే యజమాని ఎన్ శ్రీనివాసన్.. కెప్టెన్ ధోనీపై ప్రశంసల జల్లు కురిపించారు.
"ఇది చాలా గొప్ప విజయం. ఈ విజయంతో చెన్నై ప్రపంచంలోనే గొప్ప జట్టుగా ఖ్యాతి గడించింది. సీఎస్కే, చెన్నై, తమిళనాడులో ధోనీ కూడా ఓ భాగం. సీఎస్కే లేకుండా ధోనీ లేడు. ధోనీ లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ లేదు."