భారత మహిళ క్రికెట్లో డే/నైట్ టెస్టు ఆడగల రోజు ఒకటస్తుందని తాను ఊహించలేదని చెప్పింది ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన. ఆస్ట్రేలియా వేదికగా మరికొన్ని నెలల్లో జరగనున్న ఈ టెస్టు గురించి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. ఆసీస్ టూర్లో భాగంగా సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు పెర్త్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
"నిజంగా చెప్పాలంటే, పురుషుల డే/నైట్ టెస్టు మ్యాచ్ చూస్తున్నప్పుడు.. నేను కూడా ఇలాంటి అనుభూతిని పొందగలనా? అని అనుకున్నా. ఆ సమయంలో నేను అనే మాటే చాలా తప్పు. కానీ, ఆసీస్తో డే/నైట్ టెస్టు ప్రకటించగానే, క్రేజీగా భావించా. చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేశా. వావ్, మేమందరం డే/నైట్ టెస్టు ఆడబోతున్నామని సంతోషపడ్డా."
-స్మృతి మంధాన, భారత మహిళా క్రికెటర్