తెలంగాణ

telangana

ETV Bharat / sports

అంతుచిక్కని వైరస్​ సోకి ఇంగ్లాండ్​ క్రికెటర్లు అస్వస్థత.. పాక్​తో తొలి టెస్ట్​ డౌటే

17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్​ గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ ఆడేందుకు వచ్చిన ఇంగ్లాండ్​ క్రికెటర్లకు అంతుచిక్కని వైరస్​ సోకింది. దీంతో తొలి టెస్ట్​ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

England cricketers virus
అంతుచిక్కని వైరస్​ సోకి ఇంగ్లాండ్​ క్రికెటర్లు అస్వస్థత.. పాక్​తో తొలి టెస్ట్​ డౌటే

By

Published : Nov 30, 2022, 6:37 PM IST

17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్​ గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ ఆడేందుకు వచ్చిన ఇంగ్లాండ్​ క్రికెటర్లు.. తొలి టెస్టుకు ఒక్క రోజు ముందు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ సహా 14 మంది బ్రిటీష్‌ క్రికెటర్లు అంతుచిక్కని వైరస్‌ సోకి అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. ఇది కొవిడ్‌ వైరస్ కాదని పాకిస్థాన్​ క్రికెట్‌ బోర్డు స్పష్టం చేసింది.

బ్రిటీష్‌ ఆటగాళ్ల అస్వస్థతతో డిసెంబర్‌ 1 నుంచి రావల్పిండి వేదికగా జరగాల్సిన తొలి టెస్ట్ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. కేవలం ఐదుగురు క్రికెటర్లు మాత్రమే ప్రాక్టీస్‌ చేశారు. ఇప్పటివరకు పీసీబీ.. ఈసీబీలు మ్యాచ్‌ నిర్వహణపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ ఆటగాళ్లకు సోకిన వైరస్‌ కరోనా కంటే ప్రమాదకరమని తెలిస్తే మాత్రం సిరీస్‌ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అనారోగ్యంతో ఉన్న ఆటగాళ్లను హోటల్‌లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు ఇంగ్లాండ్​ జట్టు ప్రతినిధి డానీ రూబెన్ తెలిపారు. స్టోక్స్ గైర్హాజరీతో టెస్ట్‌ సిరీస్ ట్రోఫీ ఆవిష్కరణ కూడా వాయిదా పడింది

ఇదీ చూడండి:క్రీడారత్నాలకు రాష్ట్రపతి అవార్డులు ప్రదానం శరత్​ కమల్​ ఖేల్​ రత్న నిఖత్​, ప్రజ్ఞానందకు అర్జున

ABOUT THE AUTHOR

...view details