తెలంగాణ

telangana

ETV Bharat / sports

రిషభ్‌ పంత్‌ స్టంపింగ్‌ను చూసి ధోనీ గర్వంగా ఫీలై ఉంటాడు: డీకే - ఇండియా బంగ్లాదేశ్​ మ్యాచ్​

బంగ్లాదేశ్‌పై తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో పంత్​ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. కీపింగ్​లో చురుగ్గా వ్యవహరించాడు. ఈ క్రమంలో పంత్‌పై సీనియర్ వికెట్ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ ప్రశంసలు కురిపించాడు. ఏమన్నాడంటే?

dhoni panth
dhoni panth

By

Published : Dec 18, 2022, 1:02 PM IST

బంగ్లాదేశ్‌పై తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ అద్భుత విజయం సాధించింది. యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ తొలి ఇన్నింగ్స్‌లో దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. అలాగే కీపింగ్‌లోనూ చురుగ్గా వ్యవహరించాడు. బంగ్లా బ్యాటర్ నురుల్‌ హసన్‌ను చేసిన స్టంప్‌ ఔట్‌ అయితే అద్భుతం. ఈ క్రమంలో పంత్‌పై సీనియర్ వికెట్ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ ప్రశంసలు కురిపించాడు.

"బంగ్లాదేశ్‌తో టెస్టులో పంత్‌ అద్భుతమైన కీపింగ్‌ నైపుణ్యాలు ప్రదర్శించాడు. ఎంఎస్ ధోనీని పంత్‌ ఆరాధిస్తాడని భావిస్తున్నా. బంగ్లాపై అతడు చేసిన స్టంపింగ్‌ను చూసి ధోనీ గర్వంగా ఫీలై ఉంటాడు. పిచ్‌ మీద బంతి చాలా వేగంగా కీపర్ వైపు వచ్చింది. అయినా, పంత్ అద్భుతంగా ఒడిసిపట్టి స్టంప్‌ చేశాడు. ధోనీ కూడా ఇలా అద్భుతంగా స్టంపౌట్‌లు చేసేవాడు. బ్యాటర్‌ను ముందే అంచనా వేసి వికెట్లను గిరాటేసేందుకు ఎంఎస్‌డీ సిద్ధంగా ఉంటాడు" అని కార్తిక్ తెలిపాడు.

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ అద్భుత విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 404 పరుగులకు ఆలౌట్‌ కాగా.. బంగ్లా 150 రన్స్‌కే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 258/2 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసింది. దీంతో 513 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ 324 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 188 పరుగుల తేడాతో బంగ్లాపై విజయం సాధించింది.

ABOUT THE AUTHOR

...view details