MS Dhoni And Suresh Raina Retirement : సరిగ్గా 3 ఏళ్ల కిందట ఇద్దరు భారత స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. ఒకరేమో టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ కాగా.. మరొకరు సురేశ్ రైనా. వీరిద్దరూ 2020 ఆగస్ట్ 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. తొలుత ధోనీ రిటైర్మెంట్నిర్ణయం ప్రకటించగా.. ఆ తర్వాత రైనా కూడా ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఈ క్రమంలో తన సోదర సమానుడైన ధోనీ రిటైర్మెంట్ ఇచ్చిన రోజే.. రైనా కూడా ఆటకు వీడ్కోలు పలికాడని నెటిజన్లు సోషల్ మీడియాలో అప్పట్లో కామెంట్లు పెట్టారు.
టీమ్ఇండియాకు అంతర్జాతీయ ట్రోఫీలు అందించిన ధోనీ..
MS Dhoni Raina CSK Team : టీమ్‌ఇండియాలోనే కాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ చాలా ఏళ్లపాటు కలిసి ఆడారు. ధోనీ నాయకత్వంలోనే భారత్ 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే ప్రపంచకప్‌లతోపాటు ఛాంపియన్స్ ట్రోఫీని (2013) గెలిచింది. అయితే.. ధోనీ ఇంకా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతుండగా.. సురేశ్ రైనా మాత్రం గతేడాది ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.
ధోనీ-రైనా స్నేహబంధం..
MS Dhoni And Suresh Raina Friendship :ధోనీ, రైనా స్నేహబంధం కేవలం మైదానంలోనే కాకుండా వ్యక్తిగతంగానూ బలమైందే. అందుకే.. చెన్నై క్రికెట్ అభిమానులు ధోనీని 'తలా' అని.. రైనాని 'చిన్న తలా'గా అని పిలుస్తారు. ఐపీఎల్‌లో సీఎస్‌కే విజయవంతంగా కొనసాగడానికి కెప్టెన్ కూల్ ధోనీతోపాటు రైనా పాత్ర కూడా చాలా కీలకమని క్రికెట్ మాజీలు అంటుంటారు. ఇలాంటి ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు ఒకే రోజు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం.. అదీ కూడా స్వాతంత్ర్య దినోత్సవం రోజునే కావడం విశేషం.