తెలంగాణ

telangana

ETV Bharat / sports

WI vs IND : సిరాజ్​​ దెబ్బ.. బ్లాక్​వుడ్​ అబ్బా.. గాల్లోకి ఎగిరి మరీ! - వెస్టిండీస్​ వర్సెస్​ భారత్​ తొలి టెస్టు స్కోర్​

Siraj Catch : డొమినికా వేదికగా బుధవారం ప్రారంభమైన భారత్​-విండీస్​ తొలి టెస్టు మ్యాచ్​లో భారత స్టార్​ పేసర్​ మహ్మద్​ సిరాజ్​ ఓ అధ్బుతమైన ఫీట్​ చేశాడు. ఇంతకీ అదేంటంటే..

Siraj Superb Catch
సిరాజ్​​ దెబ్బకు బ్లాక్​వుడ్​ అబ్బా.. గాల్లోకి ఎగిరిమరి ఒంటిచేత్తో క్యాచ్​..

By

Published : Jul 13, 2023, 4:37 PM IST

Siraj Diving Catch : డొమినికాలోని విండ్సర్‌ పార్క్​ వేదికగా భారత్​-వెస్టిండీస్​ తొలి టెస్టు ప్రారంభమైంది. ఆట తొలిరోజే విండీస్​ ఆటగాళ్లను కట్టడి చేసింది రోహిత్​ సేన..తమదైన స్టైల్​లో ఆడింది. అయితే ఈ మ్యాచ్​లో టీమ్​ఇండియా స్టార్​ పేసర్​ మహ్మద్​ సిరాజ్​ పట్టిన డైవింగ్​ క్యాచ్​.. అందరి చేత ఔరా అనిపిస్తోంది. గాల్లోకి ఎగిరి మరి అతను ఈ క్యాచ్​ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవ్వగా..దీన్ని చూసిన నెటిజన్స్​ సిరాజ్ ఫీల్డింగ్‌ను మెచ్చుకుంటూ ప్రశంసిస్తున్నారు.

Mohammed Siraj Catch : విండీస్‌ ఇన్నింగ్స్​లో రవీంద్ర జడేజా వేసిన 28వ ఓవర్‌లో వెస్టిండీస్‌ బ్యాటర్ బ్లాక్‌వుడ్ భారీ షాట్‌ కొట్టేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో లాంగ్‌ మిడాఫ్‌ లెంత్​లో తను ఫీల్డింగ్​ చేస్తున్న వైపుకు వస్తున్న బంతిని గమనించిన సిరాజ్..​ గాల్లోకి ఎగిరి మరి ఒంటిచేత్తో క్యాచ్​ పట్టాడు. దీంతో బ్లాక్‌వుడ్​ కేవలం 14 పరుగులకే పెవిలియన్​ చేరాడు. అయితే క్యాచ్​ పట్టే సమయంలో సిరాజ్​ మోచేయి బలంగా నేలకు తాకడం వల్ల కాస్త ఇబ్బంది పడ్డట్లు కనిపించాడు. క్యాచ్​ పట్టగానే కొన్ని క్షణాలు సిరాజ్​ మైదానంలో అలానే వాలిపోయాడు. తోటి ఆటగాళ్లు దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పడం వల్ల మళ్లీ తిరిగి ఆటలోకి దిగి బౌలింగ్​ వేశాడు. అనంతరం కీలక బ్యాటర్​ హోల్డర్​ వికెట్‌ను తీశాడు. ఈ వికెట్‌తో ఫస్ట్ సెషన్ ముగియగా.. వెస్టిండీస్ 68/4తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

బుధవారం మొదలైన తొలి టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్​ను ఆదిలోనే కట్టడి చేశారు భారత బౌలర్లు. కీలక వికెట్స్​ తీస్తూ ప్రమాదకర బ్యాటర్లను పెవిలియన్​కు చేర్చారు. త్యాగ్‌ నారాయణ్‌ చందర్‌పాల్ (12), క్రైగ్ బ్రాత్‌వైట్‌ (20), రేమాన్ రీఫర్‌ (2)లు త్వరగా వెనుదిరిగారు.

అరంగేట్ర ఆటగాళ్లు..
West Indies vs India : ఈ సిరీస్​తోనే టెస్టుల్లో అరంగేట్రం చేసిన విండీస్​ ప్లేయర్​ అలీక్ ఇథనోజ్ 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. క్రీజులోకి వచ్చిన జాసన్ హోల్డర్​తో కలిసి జాగ్రత్తగా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌తో ఇషాన్ కిషన్‌, యశస్వీ జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. విరాట్​ కోహ్లీ చేతుల మీదుగా ఇషాన్ కిషన్​.. కెప్టెన్​ రోహిత్​ శర్మ చేతుల మీదుగా యశస్వీ జైస్వాల్​ అరంగేట్ర క్యాప్‌లు అందుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details