Mohammad Shami Covid Positive : ప్రస్తుతం టీమ్ ఇండియాలో అనుభవం కలిగిన బౌలర్లలో మహమ్మద్ షమీ ముందు వరుసలో ఉంటాడు. అయితే ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు షమీని స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికచేయడం విమర్శలకు దారి తీసింది. ఒక నాణ్యమైన బౌలర్‌ను ఇలా స్టాండ్ బై ప్లేయర్‌గా ఉంచడం ఎంతవరకు సమంజసమని అభిమానులు మండిపడ్డారు.
గాయాలతో జట్టుకు దూరమైన బుమ్రా, హర్షల్ పటేల్‌లు టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైనప్పటికీ... ఎంతవరకు రాణిస్తారనేది ప్రశ్నార్థకమే. అనుభవం దృష్యా బుమ్రా మంచి బౌలర్ కావొచ్చు.. కానీ గాయం తర్వాత తిరిగొస్తున్నాడు.. అతను ఎలా ఆడతాడనేది ఇప్పుడే చెప్పలేం. హర్షల్ పటేల్‌ది ఇదే పరిస్థితి. ఇలాంటి సమయంలో షమీని తుది జట్టులో చోటు ఇవ్వాల్సింది పోయి స్టాండ్ బై ప్లేయర్‌గా ఉంచడం ఏంటని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. షమీ విషయంలో పరోక్షంగా బీసీసీఐని తప్పుబట్టారు.