తెలంగాణ

telangana

ETV Bharat / sports

10,868 పరుగులు - 2 సార్లు వరల్డ్​కప్ ఫైనల్​ చేర్చిన కెప్టెన్ - 20 ఏళ్ల కెరీర్​లో మిథాలీ ఘనతలు ఇవే!

Mithali Raj Birthday : టీమ్ఇండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్.. కెరీర్​లో జట్టుకు ఎన్నో విజయాలు కట్టబెట్టింది. ఆమె సుదీర్ఘంగా 20 ఏళ్లకు పైగా టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించింది. ఇక ఆమె అంతర్జాతీయ కెరీర్​లో మిథాలీ సాధించిన రికార్డులపై ఓ లుక్కేయండి.

mithali raj birthday
mithali raj birthday

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 1:24 PM IST

Updated : Dec 3, 2023, 2:45 PM IST

Mithali Raj Birthday : టీమ్ఇండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 20 ఏళ్లకు పైగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆమె సుదీర్ఘ ప్రయాణంలో జట్టుకు అనేక చారిత్రక విజయాలు కట్టబెట్టింది. ఆమె నాయకత్వంలో టీమ్ఇండియా.. మూడు ఫార్మాట్​లలో అదరగొట్టింది. ఇక గతేడాది జూన్​లో మిథాలీ.. అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్​బై చెప్పింది. 2022లో ఆమె బయోపిక్ కూడా 'శభాష్ మిథు' తెరకెక్కింది. ఈ బయోపిక్​లో మిథాలీ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను నటించారు. ఇక నేడు (డిసెంబర్ 3) ఆమె బర్త్​ డే సందర్భంగా.. మిథాలీ సాధించిన కొన్ని ఘనతలేంటో చూద్దాం.

  • 1999లో మిథాలీ ఇంటర్నేషనల్ క్రికెట్​లో అడుగుపెట్టింది.
  • అన్ని ఫార్మాట్​లలో కలిపి మిథాలీ 333 అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడింది.
  • మూడు ఫార్మాట్​లలో ఆమె 10868 పరుగులు సాధించింది. అందులో 8 సెంచరీలు, 85 ఫిఫ్టీలు ఉన్నాయి.
  • మహిళల టెస్టు క్రికెట్​లో డబుల్ సెంచరీ సాధించిన అతిపిన్న వయస్కురాలిగా మిథాలీ రికార్డు కొట్టింది.
  • మిథాలీ సారధ్యంలో టీమ్ఇండియా రెండుసార్లు వన్డే వరల్డ్​కప్ ఫైనల్ ఆడింది.
  • మహిళా వరల్డ్​కప్​లో ఎక్కువ ఎడిషన్​లలో పాల్గొన్న ప్లేయర్ మిథాలీనే. ఆమె ఏకంగా ఆరుసార్లు (2000, 2005, 2009, 2013, 2017, 2022) ఆడింది.
  • వన్డే వరల్డ్​కప్​లో టీమ్ఇండియాను రెండుసార్లు ఫైనల్​ చేర్చిన కెప్టెన్ మిథాలీయే.

World Cup 2005 Women's: 2005 వరల్డ్​కప్​లో మిథాలీ టీమ్ఇండియాకు కెప్టెన్​గా వ్యవహరించింది. ఈ టోర్నమెంట్​లో లీగ్​ దశలో భారత్.. నాలుగు విజయాలతో సెమీస్​లో ఆడుగుపెట్టింది. ఇక సెమీస్​లో న్యూజిలాండ్​పై మిథాలీ 91 పరుగులు నాటౌట్​గా నిలిచి.. టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఈ మ్యాచ్​లో భారత్.. కీవీస్​పై 40 పరుగుల తేడాతో నెగ్గి.. ఫైనల్​లోకి దూసుకెళ్లింది. కానీ, ఫైనల్​లో ఆస్ట్రేలియాను ఢీకొట్టిన మిథాలీ సేన.. 98 పరుగుల తేడాతో ఓడి రన్నరప్​తో సరిపెట్టుకుంది.

World Cup 2017 Women's : 2017 ప్రపంచకప్​లోనూ భారత్.. మిథాలీ సారథ్యంలో ఫైనల్​ చేరింది. ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్​తో తలపడ్డ టీమ్ఇండియా.. విజయం అంచుల దాకా వచ్చి 9 పరుగుల తేడాతో టైటిల్ చేజార్చుకుంది. ఇంగ్లాండ్ 228 పరుగులు చేయగా.. టీమ్ఇండియా 219 పరుగులకు ఆలౌటైంది. మిథాలీ సారథ్యంలో టీమ్ఇండియా రెండుసార్లు ఫైనల్​ చేరినా.. భారత్ ఛాంపియన్​దా నిలవలేకపోయింది.

Cricketer Mithali raj inaugurated Tournament : క్రీడోత్సవాలను ప్రారంభించిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్

మిథాలీ, నా ఆలోచనలు ఒకేలా ఉంటాయి: తాప్సీ

Last Updated : Dec 3, 2023, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details