Womens T20 Challenge: మహిళల టీ20 ఛాలెంజ్‌కు రంగం సిద్ధమైంది. మే 23 నుంచి పుణెలోని ఎమ్సీఏ స్డేడియంలో ఈ టోర్నీ ప్రారంభంకానుంది. హర్మన్‌ప్రీత్ కౌర్‌ను సుపర్నోవాస్, స్మృతి మంధానను ట్రైల్‌బ్లేజర్స్, దిప్తి శర్మను వెలాసిటీ జట్టుకు కెప్టెన్లుగా ప్రకటిస్తూ మూడు టీమ్‌లకు సంబంధించిన ఆటగాళ్ల పేర్లను తెలిపింది బీసీసీఐ. మరోవైపు సీనియర్ ప్లేయర్స్ మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి షాక్ ఇచ్చింది బోర్డు. వారికి అవకాశం దక్కలేదు.
ఈ సారి టోర్నీ మొత్తంలో 12 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. వీరిలో ఇంటర్నేషనల్ స్టార్లలో దక్షిణాఫ్రికా నుంచి సూన్ లూస్(sune luus), లారా వోల్వార్డ్ట్, అయాబొంగా ఖాకా, నాథ్కన్ చంటమ్(థాయ్‌లాండ్), అలానా కింగ్(ఆస్ట్రేలియా లెగ్ స్పిన్ర్), ఇంగ్లాండ్ ప్లేయర్స్ సోఫీ ఎక్లెస్టోన్, సోఫియా డంక్లీ, కేట్ క్రాస్.. బంగ్లాదేశ్ ఆటగాళ్లు సల్మా ఖాతున్, షర్మిన్ అఖ్తర్, వెస్టిండీస్ నుంచి డియాండ్రా డాటిన్, హెలే మ్యాథ్యూస్ ఉన్నారు. కాగా, ఈ టోర్న్‌మెంట్.. మే 23న ట్రైల్‌బ్లేజర్స్ సూపర్ నోవాస్ మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రారంభంకానుంది. ఫైనల్ మే 28న జరుగుతుంది.
సూపర్ నోవాస్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), తానియా భాటియా, అలానా కింగ్, ఆయుష్ సోనీ, చందు వి, డియాండ్రా డాటిన్, హర్లీన్ డియోల్, మేఘనా సింగ్, మోనికా పటేల్, ముస్కాన్ మాలిక్, పూజా వస్త్రాకర్, ప్రియా పునియా, రాశి కనోజియా, సోఫీ ఎక్లెస్టోన్, సూన్ లూస్, మాన్సీ జోషి.