ఫిఫా ప్రపంచకప్ ఫైనల్స్‌లో విజయం తర్వాత ఖతార్ చక్రవరి షేక్ తమీమ్ బిన్ హమద్ ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సికి 'బిష్ఠ్' అనే సంప్రదాయ వస్త్రాన్ని బహూకరించారు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వస్త్రం గురించి చర్చించుకున్నారు. ఇటీవల మెస్సి 'బిష్ఠ్'కు ఓ వ్యక్తి భారీ ఆఫర్ చేశారు. ఆ 'బిష్ఠ్' తనకు ఇస్తే మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని ఒమన్‌కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, లాయర్ అహ్మద్ అల్ బర్వాని ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు.
వామ్మో.. మెస్సి 'బిష్ఠ్'కు రూ.82 లక్షల ఆఫర్!
మెస్సి ప్రపంచకప్ ఫైనల్‌లో ధరించిన బిష్ఠ్‌కు భారీ డిమాండ్ వచ్చింది. ఓ పార్లమెంట్ సభ్యుడు రూ.8.5 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు.
ది నేషనల్ పత్రికతో బర్వాని మాట్లాడుతూ.. మెస్సి సానుకూలంగా ఉంటే అతడికి ఎంత ధర కావాలో చెప్పవచ్చని కూడా పేర్కొన్నాడు. బిష్ఠ్‌ను బహూకరిస్తున్న సమయంలో తాను దోహాలోని స్టేడియంలోనే ఉన్నట్లు తెలిపాడు. దీనిని తాను ధరించనని.. ప్రదర్శనలో ఉంచుతానన్నాడు. జీవితంలో ఏదైనా సాధ్యమే అనే సందేశం ప్రజలకు ఇచ్చేందుకు ఇది గుర్తుగా ఉంటుందని పేర్కొన్నాడు.
బిష్ఠ్ అరబ్ సంప్రదాయ వస్త్రం. దీనిని గొర్రె ఉన్ని, ఒంటె వెంట్రుకలతో కలిపి తయారు చేస్తారు. అరబ్ దేశాల్లో రాజులు, మతపెద్దలు ధరిస్తుంటారు. ప్రపంచకప్‌లో విజయం తర్వాత మెస్సిదీనిని ధరించి కనపించడం సంచలనం సృష్టించింది. ప్రపంచకప్‌ను అందుకొన్న తర్వాత ఫొటోషూట్ సమయానికి మెస్సిఅర్జెంటీనా జెర్సీ ధరించి వచ్చాడు. ఈ జెర్సీపై మూడు నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలు అర్జెంటీనా 1978, 1986, 2022ల్లో ఫిఫా ప్రపంచకప్‌లు గెలిచినందుకు చిహ్నాలు.