Kusal Mendis World Cup 2023 : ENG vs SL: క్రికెట్లో సాధారణంగా వైడ్ బాల్‌కు వికెట్ కీపర్లు స్టంపౌట్ చేయడం మనం చూస్తూంటాం. కానీ రనౌట్ చేయడం మాత్రం ఎప్పుడో ఒకసారే చూస్తాం. వికెట్ కీపర్ ఏదైనా తప్పు చేసి బంతిని వదిలిస్తే బ్యాటర్ పరుగుకు ప్రయత్నించినప్పుడు.. ఇతర ఫీల్డర్ సాయంతో రనౌట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ వైడ్ బాల్‌ను నేరుగా అందుకొని నాన్‌స్ట్రైకర్ వైపు ఉన్న బ్యాటర్‌ను రనౌట్ చేయడం మాత్రం చాలా అరుదు. తాజాగా ఇంగ్లాండ్ - శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన జరిగింది.
శ్రీలంక కెప్టెన్, వికెట్ కీపర్ కుశాల్ మెండీస్ చేసిన ఈ పనికి ఇంగ్లాండ్ బ్యాటర్ ఆదిల్ రషీద్ ఒక్కసారిగా షాకయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోను చూని నెటిజన్లు షాకైనప్పటికీ.. కుశాల్ మెండీస్ ఆటతీరుపై ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే ?
ఆదిల్ రషీద్‌కు వేసిన 32వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్ చివరి బంతిని తీక్షణ వైడ్ వేయగా.. దాన్ని వికెట్ కీపర్ కుశాల్ మెండీస్ అందుకుని నేరుగా నాన్‌స్ట్రైకర్ వికెట్లను కొట్టాడు. ఆ సమయంలో ఆదిల్ రషీద్ క్రీజు ధాటి ఉండటం వల్ల రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ విషయాన్ని రిప్లేలో పరిశీలించిన తర్వాత అంపైర్లు ఆదిల్ రషీద్‌ను ఔట్‌గా తేల్చారు.