తెలంగాణ

telangana

ETV Bharat / sports

మోకాలికి తీవ్ర గాయం.. ఐపీఎల్​ నుంచి కుల్దీప్ ఔట్

కోల్​కతా నైట్​రైడర్స్ సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్​ ఐపీఎల్​ 2021(kuldeep yadav ipl 2021)కు పూర్తిగా దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా అతడు తిరిగి స్వదేశానికి రానున్నాడని తెలుస్తోంది.

Kuldeep Yadav
కుల్దీప్

By

Published : Sep 27, 2021, 5:06 PM IST

కోల్​కతా నైట్​రైడర్స్ సీనియర్ స్పిన్నర్​ కుల్దీప్​ యాదవ్​ ఐపీఎల్ 2021(kuldeep yadav ipl 2021)కు పూర్తిగా దూరమయ్యాడు. ప్రాక్టీస్​ సమయంలో మోకాలికి గాయం(kuldeep yadav injury) కావడం వల్ల ఇతడు టోర్నీ నుంచి వైదొలిగాడు. గాయం కాస్త పెద్దది కావడం వల్ల అతడు దాదాపు 4-6 నెలల పాటు క్రికెట్​కు దూరం కానున్నాడు. ఈ సమయంలో జాతీయ శిక్షణ శిబరంలో ఇతడు కోలుకోనున్నాడు.

ఇదే విషయంపై ఓ బీసీసీఐ అధికారి స్పందిస్తూ.. "యూఏఈలో ప్రాక్టీస్ సమయంలో కుల్దీప్ కాలు తీవ్రంగా ఫ్రాక్చర్ అయిందని మాకు సమాచారం అందింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతడి కాలు మెలిక పడింది. అతడు స్వదేశానికి రానున్నాడు" అని తెలిపారు.

అయితే ఇటీవలే కుల్దీప్​కు మోకాలి సర్జరీ(kuldeep yadav injury) అయిందని తెలుస్తోంది. దీంతో అతడు దేశవాళీ క్రికెట్​కూ దూరం కానున్నాడని సమాచారం. "మోకాలి గాయం(kuldeep yadav injury) అనేది చాలా కష్టమైంది. దీని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎన్​సీఏలో దీర్ఘకాల ఫిజియోథెరపీకి హాజరు కావాల్సి ఉంటుంది" అని ఓ అధికారి వెల్లడించారు.

ఐపీఎల్​లో కోల్​కతాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కుల్దీప్​కు అవకాశాలు మాత్రం రావట్లేదు. రెండు సీజన్లుగా అతడిని తుది జట్టులోకి తీసుకోవడం లేదు. దీనిపై చాలాసార్లు అసంతృప్తిని వ్యక్తం చేశాడీ స్పిన్నర్.

ఇవీ చూడండి: ఆర్సీబీ కెప్టెన్​గా కేఎల్ రాహుల్.. నిజమెంత?

ABOUT THE AUTHOR

...view details