కృనాల్ పాండ్యాకు కరోనా.. రెండో టీ20 వాయిదా - ఇండియా Vs శ్రీలంక వార్తలు
16:06 July 27
కరోనా కలకలం
టీమ్ఇండియా, శ్రీలంక మధ్య మంగళవారం జరగనున్న రెండో టీ20 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ ఎదురైంది! భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో అతడితో సన్నిహతంగా ఉన్న 8 మంది క్రికెటర్లనూ ఐసోలేషన్‌కు తరలించారు. దీంతో నేడు(జులై 27)న జరగాల్సిన మ్యాచ్‌ను బుధవారానికి(జులై 28) వాయిదా వేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాలోని మిగిలిన క్రికెటర్లకూ కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
అయితే లంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌ను ఈనెల 13 నుంచి ప్రారంభించాల్సి ఉంది. కానీ, లంక బ్యాటింగ్ కోచ్, సహాయక సిబ్బందికి కరోనా సోకడం వల్ల జులై 18 నుంచి వన్డే సిరీస్ ప్రారంభించారు.
పరిమిత ఓవర్ల సిరీస్ కోసం లంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన తొలి టీ20లో 38 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. అయితే ఇదే ఉత్సాహంలో రెండో మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ను దక్కించుకోవాలని గబ్బర్ సేన ప్రణాళికలు రచించింది.