Kohli on pujara, Rahane: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో విఫలమైన పుజారా, రహానె ఇకపై టెస్టులో కొనసాగే సూచనలు కనిపించడం లేదు. వారిపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు మ్యాచుల ఈ సిరీస్‌లోని ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి పుజారా(124), రహానె(136) పరుగులు మాత్రమే చేశారు. దీంతో వీరిద్దరి కెరీర్ ముగిసిపోతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నిజానికి టీమ్ఇండియా టెస్టు జట్టు విదేశాల్లో గత మూడేళ్లుగా విజయాల్ని సాధించడంలో రహానె, పుజారా కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ కొంతకాలంగా వీరు ఫామ్ కోల్పోవడం వల్ల జట్టుకు భారం అయ్యారు. ఇక రహానె కోసం అరంగేట్ర మ్యాచులోనే శతకం బాదిన శ్రేయస్ అయ్యర్‌ను పక్కనపెట్టింది టీమ్ఇండియా మేనేజ్మెంట్. మరోవైపు పుజారా స్థానం కోసం సూర్యకుమార్ యాదవ్ ఎదురుచూస్తున్నాడు. కానీ పుజారా, రహానెపై నమ్మకం ఉంచి దక్షిణాఫ్రికా సిరీస్‌లో అవకాశం ఇచ్చారు. కానీ వారు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీంతో అభిమానులు కూడా సోషల్మీడిాయ వేదికగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.