తెలంగాణ

telangana

ETV Bharat / sports

నట్టూ సర్జరీ సక్సెస్- బీసీసీఐకి థ్యాంక్స్​ - natarajan thanks bcci

టీమ్​ఇండియా యార్కర్ స్పెషలిస్ట్​ నటరాజన్​కు మోకాలి శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ సందర్భంగా బీసీసీఐతో పాటు వైద్య బృందానికి కృతజ్ఞతలు చెప్పాడు నట్టూ. ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో సన్​రైజర్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Knee surgery performed, Natarajan thanks BCCI and medical team
తంగరసు నటరాజన్, నట్టూ సర్జరీ విజయవంతం.. బీసీసీఐకి థ్యాంక్స్​

By

Published : Apr 27, 2021, 5:15 PM IST

Updated : Apr 27, 2021, 6:16 PM IST

టీమ్​ఇండియా యార్కర్ స్పెషలిస్ట్​ తంగరసు నటరాజన్ ​మోకాలికి మంగళవారం శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుత ఐపీఎల్​లో సన్​రైజర్స్​ తరఫున ఆడుతున్న నట్టూ.. మోకాలి గాయం కారణంగా లీగ్​కు దూరమయ్యాడు. ఈ సీజన్​లో హైదరాబాద్​ తరఫున కేవలం రెండే మ్యాచ్​లు ఆడాడు.

"ఈ రోజు నా మోకాలికి సర్జరీ నిర్వహించారు వైద్యులు. ఈ సందర్భంగా వైద్యబృందంతో పాటు సహాయక సిబ్బందికి ధన్యవాదాలు. నా క్షేమం కోరుతూ సందేశాలు పంపిన వారందరికీ కృతజ్ఞతలు. బీసీసీఐకి ప్రత్యేక ధన్యవాదాలు" అని నటరాజన్ ట్వీట్ చేశాడు.

ఇదీ చదవండి:'ప్రత్యేక ఏర్పాట్లు చేయండి- అదేం కుదరదు'

గతేడాది ఐపీఎల్​ డెత్​ ఓవర్లలో యార్కర్లతో సంచలనం సృష్టించాడు నటరాజన్. అనంతరం ఆసీస్ పర్యటనకు నెట్​ బౌలర్​గా వెళ్లి.. భారత్​ తరఫున మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేశాడు. తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన అతడు వంద శాతం ఫిట్​గా లేనప్పటికీ ఇంగ్లాండ్​తో సిరీస్​కు ఎంపికయ్యాడు.

ఇదీ చదవండి:'మీరు సజావుగా వెళ్లాకే.. లీగ్​​ ముగిసినట్లు భావిస్తాం'

Last Updated : Apr 27, 2021, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details