టీమ్ ఇండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. గురువారం జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతని చేతికి గాయమైనట్లు సమాచారం. అయితే అతని గాయం అంత తీవ్రమైనది కాదని, ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే రెండో టెస్టులో రాహుల్ ఆడనున్నాడా లేదా అనే విషయం పై క్లారిటీ ఇవ్వలేదు.
ప్రాక్టీస్‌లో రాహుల్‌కు గాయం.. రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడా? - టీమ్ ఇండియా ప్లేయర్ కేఎల్ రాహుల్
టీమ్ ఇండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. గురువారం జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతని చేతికి గాయమైనట్లు సమాచారం.
kl rahul
ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ గాయం వల్ల చివరి వన్డేతో పాటు టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఉన్న కేఎల్ రాహుల్ సైతం ఇప్పుడు మ్యాచ్‌కు దూరమవుతున్నాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అతడి స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.