కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో విచిత్రం చోటు చేసుకుంది. మంగళవారం సెయింట్ లూసియా కింగ్స్(ఎస్‌ఎల్‌కే), ట్రిన్‌బాగో నైట్ రైడర్స్(టీకేఆర్) జట్ల మధ్య జరిగిన మ్యాచులో.. ఎస్‌ఎల్‌కే తరఫు బౌలర్ వహబ్ రియాజ్ భారీ వైడ్ వేశాడు. క్రీజులో ఉన్న టీకేఆర్ బ్యాట్స్‌మెన్ టిమ్ సీఫర్ట్ ఆ బంతిని ఆడేందుకు ప్రయత్నించినా అందలేదు. అయినా, ఫీల్డ్ అంపైర్ దాన్ని వైడ్‌గా పరిగణించలేదు. దీంతో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న మరో బ్యాట్స్‌మెన్ కీరన్ పొలార్డ్ అంపైర్ నిర్ణయాన్ని నిరసిస్తూ.. అంపైర్ నుంచి దూరంగా వెళ్లి నిలబడి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
వైడ్ ఇవ్వని అంపైర్.. పొలార్డ్ వింత నిరసన - అంపైర్‌తో పొలార్డ్ వాగ్వాదం
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో తన వినూత్న నిరసనతో వార్తల్లో నిలిచాడు వెస్టిండీస్ క్రికెటర్ పొలార్డ్. ఓ బంతిని అంపైర్ వైడ్ ఇవ్వనుందుకు నిరసన తెలిపాడు.
పొలార్డ్
ఈ మ్యాచులో పొలార్డ్ (26 బంతుల్లో 41), మరో బ్యాట్స్ మెన్ సీఫర్ట్ (25 బంతుల్లో 37) కలిసి ఐదో వికెట్‌కు 78 పరుగులు జోడించి ఎస్‌ఎల్‌కే ముందు 158 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. అనంతరం ఛేదనకు దిగిన ఎస్‌ఎల్‌కే.. నిర్ణీత 20 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీకేఆర్ జట్టు 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.