Kevin pietersen on Jadeja: చెన్నై జట్టు కెప్టెన్‌గా ఇటీవలే నియమితుడైన రవీంద్ర జడేజా.. ధోనీలాగే ప్రశాంతమైన ఆటగాడని, అతడు కూడా మాజీ సారథిలాగే జట్టును నడిపిస్తాడని ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. మైదానంలో చురుగ్గా ఉంటాడని, సరైన నిర్ణయాలు తీసుకుంటాడని కొనియాడాడు. అలాగే ధోనీ.. జడేజాను కెప్టెన్‌గా ఎంపిక చేయడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని తెలిపాడు. తాజాగా ఓ వెబ్‌సైట్‌కు రాసిన కథనంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
'జడ్డూ తెలివైన క్రికెటర్... ధోనీలాగే నడిపిస్తాడు' - రవీంద్ర జడేజా సీఎస్కే
Kevin pietersen on Jadeja: సీఎస్కే కెప్టెన్ రవీంద్ర జడేజాపై ఇంగ్లాండ్ జట్టు మాజీ సారథి కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు. మైదానంలో జడేజా చాలా చురుగ్గా ఉంటాడని కొనియాడాడు. అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేయడం తనకు ఆశ్చర్యం కలిగించలేదన్నాడు.
'ధోనీ తప్పుకొనేందుకు ఇదే సరైన సమయం అని ఆ జట్టు భావించి ఉండొచ్చు. అయితే, అతడు జడేజాను ఎంచుకోవడం నన్నేమి ఆశ్చర్యానికి గురిచేయలేదు. జడ్డూ చాలా గొప్ప ఆటగాడు మాత్రమే కాదు. తెలివైన క్రికెటర్ కూడా. టీ20ల్లో ఎంతో అనుభవం ఉన్న ఆల్‌రౌండర్. ధోనీలా ప్రశాంతంగా ఆలోచిస్తాడు. దీంతో ఈసారి కూడా ఆ జట్టు మిగతా జట్లను ఓడించి.. ఆశ్చర్యపరిచే అవకాశం ఉంది. గతేడాది కూడా ఆ జట్టు అందరి అంచనాలను తలకిందులు చేసింది. అప్పుడు నేను కూడా ఆ జట్టును తక్కువగా చూశా. ఇప్పుడు ఆ జట్టులో యువరక్తం పారుతోంది. ఆ జట్టులో సరైన నిర్ణయాలు తీసుకునే మేటి క్రికెట్ బుర్రలు ఉన్నాయి. దీంతో ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించగలమనే నమ్మకంతో ఉన్నారు. సహజంగా టీ20 క్రికెట్‌లో పరిస్థితులకు తగ్గట్టు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రత్యర్థుల కంటే ఎవరు మంచి నిర్ణయాలు తీసుకుంటారో వారే విజేతలుగా నిలుస్తారు' అని పీటర్సన్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి:IPL 2022: మట్టిలో మాణిక్యాలు... ఈ కుర్రాళ్ల ఆట చూడాల్సిందే!