లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్-న్యూజిలాండ్ తొలి టెస్టులో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొలి ఇన్నింగ్స్లో 13 పరుగులు చేసి అండర్సన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. రెండో ఇన్నింగ్స్లో ఒక్క పరుగుకే రాబిన్సన్ బౌలింగ్లో వెనుదిరిగాడు.
'సన్స్' చేతిలో ఔటైన 'సన్'- ఇదే తొలిసారి!
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో విచిత్రం జరిగింది. కివీస్ కెప్టెన్ విలియమ్సన్.. పేరు చివర 'సన్' ఉన్న బౌలర్ల చేతిలో ఔటయ్యాడు. టెస్టుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి.
కేన్ విలియమ్సన్, కివీస్ కెప్టెన్
ఇలా పేరు చివర 'సన్' ఉన్న బౌలర్ల చేతిలో ఒకే టెస్టులో ఔటయ్యాడు కేన్. ఇక విలియమ్సన్ పేరు చివర్లోనూ 'సన్' ఉంది. టెస్టుల్లో ఇలా 'సన్స్' చేతిలో 'సన్' ఔట అవ్వడం ఇదే తొలిసారి.
ఇదీ చదవండి:'నేటి మేటి టెస్టు బౌలర్లలో అశ్విన్ ఒకడు'