ఇంగ్లాండ్‌లోని ఓవల్ స్టేడియంలో క్రికెట్ అభిమాని డేనియల్ జర్వో(jarvo) మరోసారి ప్రత్యేక్షమయ్యాడు. ఇంగ్లాండ్- భారత్ నాలుగో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆయన మైదానంలోకి దూసుకురావడం.. బౌలింగ్ చేయడం.. స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు ఇరు జట్ల ఆటగాళ్లను ఆశ్చర్యానికి గురిచేసింది.
టీమ్ఇండియా- ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో క్రికెట్ అభిమాని, యూట్యూబర్ డేనియల్ జర్వో మరోసారి ప్రత్యక్షమయ్యాడు. ఉమేశ్ యాదవ్(Umesh yadav) బౌలింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మెరపువేగంతో దూసుకొచ్చాడు. ఈసారి బౌలర్‌గా యాక్షన్ పూర్తి చేసిన అతడు.. చివర్లో పట్టుతప్పి ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ బెయిర్ స్టోను ఢీకొట్టాడు. ఈ ఉదంతంతో సోషల్ మీడియాలో జర్వో గురించి మరోసారి చర్చ జరుగుతోంది.
జర్వో వ్యవహరించిన తీరు సరికాదని చెబుతూ, కామెంటేటర్ హర్ష భోగ్ల్ ట్వీట్ కూడా చేశారు.