టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) టీమ్ఇండియా మెంటార్‌గా ఎంఎస్ ధోనీని నియమించాల్సిన అవసరం ఏముందని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ప్రశ్నించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి నేతృత్వంలో టీమ్ఇండియా అద్భుత ప్రదర్శన చేస్తుంటే మెంటార్ అవసరమే లేదని అభిప్రాయపడ్డాడు.
"మెంటార్‌గా ధోనీని నియమించడం వెనుక ఉద్దేశం ఏంటో అర్థం కావడంలేదు. నేను ధోని గురించి.. ఆటపై అతడికి ఉన్న అవగాహన, జట్టుకు అతడు ఎలా ఉపయోగపడతాడు.. లాంటి విషయాల గురించి మాట్లాడటం లేదు. కెప్టెన్‌గా వైదొలగడానికి ముందే విరాట్ కోహ్లీకి అతడు మెంటార్‌గా ఉన్నాడు. ధోనీకి నాకన్న పెద్ద ఫ్యాన్ లేడు. వీడ్కోలుకు ముందే కెప్టెన్‌ను తయారు చేసిన తొలి సారథి మహీ. కానీ, ఈ నిర్ణయం నాకు ఆశ్చర్యకరంగా ఉంది"
- అజయ్ జడేజా, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు సెలక్టర్లు. ఈ సందర్భంగా టోర్నీలో మెంటార్‌గా వ్యవహరించేందుకు మాజీ సారథి ధోనీ అంగీకరించినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.