టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ గత కొంతకాలంగా తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు. ఐపీఎల్ 2023లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు సారధ్యం వహిస్తున్న రాహుల్.. లీగ్‌లోనూ అంతగా రాణించలేకపోతున్నాడు. అయితే గత రెండు మ్యాచ్‌ల్లో మాత్రం రాహుల్ పర్వాలేదనపించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన అతడు.. రాజస్థాన్‌తో తలపడ్డ మ్యాచ్‌లో 39 పరుగులతో రాణించాడు.
అయితే రాహుల్‌ను పక్కన పెట్టి భారత జట్టులో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. కేఎల్ రాహుల్‌కు మరోసారి మద్దతుగా నిలిచాడు. సంజూ శాంసన్ కంటే రాహుల్ ఎంతో నయమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
"కేఎల్ రాహుల్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. అతడి స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండవచ్చు కానీ.. అతడు ఫామ్‌లోకి రావడం లఖ్‌నవూకు శుభసూచకం. రాజస్థాన్ రాయల్స్‌లో ట్రెంట్ బౌల్ట్ తప్ప మినహా అంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్ ఎవరూ లేరు. అయితే ఆ జట్టులో చాహల్, అశ్విన్ వంటి స్టార్ స్పిన్నర్లు ఉన్నారు. కానీ రాహుల్ ఎక్కువ సేపు క్రీజులో వుంటే వారికి కచ్చితంగా చుక్కలు చూపిస్తాడు. సంజూ శాంసన్ కంటే కేఎల్ రాహుల్ చాలా బెటర్ అని నేను భావిస్తాను. అతడు విదేశీ గడ్డపై టెస్టు సెంచరీలు సాధించాడు. అదే విధంగా ఓపెనర్‌గా మిడిలార్డర్‌లో రాణించే సత్తా అతడికి ఉంది. టీ20ల్లో కూడా చాలా పరుగులు చేశాడు" అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
గతరాత్రి లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడింది. ప్రస్తుత సీజన్లో పూర్తిగా బ్యాటర్ల ఆధిపత్యం సాగుతోంది. కానీ ఈ మ్యాచ్‌లో అందుకు భిన్నంగా ఇరు జట్ల బౌలర్లు వారి సత్తా చాటారు. హేమాహేమీ బ్యాటర్లతో పటిష్ఠంగా ఉన్న రాజస్థాన్.. లఖ్‌నవూ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక విజయం ముంగిట చతికిలపడింది. ఫలితంగా సీజన్లో రెండో ఓటమిని చవిచూసింది.