తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2021: ఈసారి కూడా పంత్​కే కెప్టెన్సీ - రిషబ్​ పంత్​

యూఏఈలో జరిగే ఐపీఎల్​ రెండో దశలోనూ పంత్​ సారథిగా కొనసాగుతాడని దిల్లీ జట్టు స్పష్టం చేసింది. సెప్టెంబరు 19 నుంచి ఈ మ్యాచ్​లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆ దేశానికి చేరుకున్న జట్లు, క్వారంటైన్​లో ఉన్నాయి.

Rishabh Pant set to remain Delhi Capitals captain for last part of IPL
IPL 2021: దిల్లీ క్యాపిటల్స్​ పగ్గాలు మళ్లీ పంత్​కే!

By

Published : Sep 4, 2021, 5:31 AM IST

Updated : Sep 4, 2021, 6:52 AM IST

త్వరలో మొదలయ్యే ఐపీఎల్​ రెండో దశలోనూ(IPL 2021) దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​గా రిషబ్​ పంత్​ ఉంటాడని యాజమాన్యం స్పష్టం చేసింది. రెగ్యులర్​ కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్​ నుంచి తప్పుకోవడం వల్ల పంత్​ను సారథిగా నియమిస్తూ.. ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో 14వ సీజన్​ రెండో భాగంలోనూ పంత్​ను(Rishabh Pant) కెప్టెన్​గా కొనసాగించనునట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

ఐపీఎల్​-14 లీగ్​ పాయింట్ల పట్టిక​లో(IPL 2021 Points Table) దిల్లీ క్యాపిటల్స్​ జట్టు 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో చెన్నై, బెంగళూరు జట్లు ఉన్నాయి. 8 పాయింట్లతో ముంబయి జట్టు నాలుగో స్థానంలో ఉంది. అయితే లీగ్​లో మిగిలిన మ్యాచ్​లను యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నిర్వహించనున్నారు. ఐపీఎల్​ సీజన్​ ముగిసిన వెంటనే ఐసీసీ టీ20 ప్రపంచకప్​(ICC T20 World Cup 2021) జరగనుంది.

ఇదీ చూడండి..IPL 2022: కొత్త జట్ల కనీస ధర పెంపు.. బోర్డుకు కాసుల వర్షమే!

Last Updated : Sep 4, 2021, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details