తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​లో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ పేసర్ - ఆర్సీబీ vs ముంబయి లైవ్

ముంబయితో మ్యాచ్​లో ఐదు వికెట్లు తీసిన హర్షల్ పటేల్.. ఐపీఎల్​లోనే అరుదైన రికార్డు సాధించాడు. ఇంతకీ అదేంటంటే?

Harshal Patel creates history
హర్షల్ పటేల్

By

Published : Apr 9, 2021, 10:02 PM IST

ఆర్సీబీ పేసర్ హర్షల్ పటేల్(5/27) ఐపీఎల్​లో చరిత్ర సృష్టించాడు. ముంబయి ఇండియన్స్​పై ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి బౌలర్​గా రికార్డులకెక్కాడు. చెన్నై వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్​లో ఈ ఘనత సాధించాడు.

హర్షల్ పటేల్

హర్షల్ వికెట్లు తీసిన వారిలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, పొలార్డ్, కృనాల్ పాండ్య, మార్కో జేన్సన్​ ఉన్నారు. అలానే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత మూడో అన్​క్యాప్​డ్ బౌలర్​గానూ హర్షల్ నిలిచాడు. ఇతడి కంటే ముందు అంకిత్ రాజ్​పుత్(5/14), వరుణ్ చక్రవర్తి(5/20) ఉన్నారు.

ఇది చదవండి:ఐపీఎల్: ముంబయి ఆచితూచి.. ఆర్సీబీ లక్ష్యం 160

ABOUT THE AUTHOR

...view details