Pravin Tambe IPL 2022: ప్రవీణ్ తాంబే.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ.. 41 ఏళ్ల వయసులో టీ20 లీగ్‌లో ఆడిన ప్లేయర్. కేవలం రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లను ఆడిన అనుభవం మాత్రమే తాంబే సొంతం. అలాంటిది రాజస్థాన్, ముంబయి, గుజరాత్ లయన్స్, హైదరాబాద్ జట్ల తరఫున తాంబే కొన్ని టీ20 మ్యాచ్‌లను ఆడటం విశేషం. మరి ఇప్పుడెందుకు వార్తల్లో నిలిచారనేగా మీ డౌట్..?
ఆ సినిమా చూసి ఏడ్చేసిన క్రికెటర్.. ఐపీఎల్ జట్టు భావోద్వేగం! - శ్రేయస్ అయ్యర్
Pravin Tambe IPL 2022: క్రికెట్ కోసం చిన్నప్పటి నుంచి కష్టపడి.. నాలుగు పదుల వయసులో టీ20లో అవకాశం దక్కించుకున్న క్రికెటర్ ప్రవీణ్ తాంబే. అతడిపై ఇటీవలే బయోపిక్ రూపొందింది. ఈ చిత్రాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ క్రికెటర్ల కోసం ప్రదర్శించగా.. వారు భావోద్వేగానికి గురయ్యారు.
క్రికెట్ కోసం చిన్నప్పటి నుంచి కష్టపడిన ప్రవీణ్ తాంబే ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నాడు. అయితే భారత జట్టు తరఫున ఆడలేకపోయినా సరే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన టీ20 లీగ్‌లో మాత్రం కాంట్రాక్ట్‌ను సంపాదించాడు. ఈ నేపథ్యంలో వచ్చిన ప్రవీణ్ తాంబే బయోపిక్ 'కౌన్ ప్రవీణ్ తాంబే?' హాట్‌స్టార్‌లో ఇవాళ (ఏప్రిల్ 1) విడుదలైంది. నిన్న కోల్‌కతా ఆటగాళ్ల కోసం ప్రత్యేక షోను యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రవీణ్ తాంబే భావోద్వేగానికి లోనయ్యాడు. కోల్‌కతా ప్లేయర్లు తాంబేను అభినందిస్తూ సందేశం ఇచ్చారు. ఈ వీడియోను కోల్‌కతా యాజమాన్యం ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.
ఇదీ చూడండి:ఐపీఎల్ పెద్దోడుపై వేటు.. మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం